NTRO Recruitment 2022: బీటెక్‌ చదివిన నిరుద్యోగులకు బంపరాఫర్‌! నేషనల్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌లో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

Srilakshmi C

Srilakshmi C |

Updated on: Oct 21, 2022 | 8:23 AM

భారత్ ప్రభుత్వ రంగానికి చెందిన నేషనల్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌.. 125 ఐటీ ప్రొఫెషనల్స్, ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు..

NTRO Recruitment 2022: బీటెక్‌ చదివిన నిరుద్యోగులకు బంపరాఫర్‌! నేషనల్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌లో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
NTRO Recruitment 2022

భారత్ ప్రభుత్వ రంగానికి చెందిన నేషనల్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌.. 125 ఐటీ ప్రొఫెషనల్స్, ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌/ఎంటెక్‌/ఎంసీఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అలాగే దరఖాస్తుదారుల వయసు పోస్టును బట్టి 30 నుంచి 62 యేళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 7, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలు, స్కిల్‌ టెస్ట్‌, అనుభవం ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ పోస్టులు: 36
  • సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామర్ పోస్టులు: 4
  • రిస్క్ అనలిస్ట్ పోస్టులు: 10
  • నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులు: 2
  • పవర్ అండ్‌ ఎనర్జీ సెక్టార్ lT & OT సెక్యూరిటీ కన్సల్టెంట్ పోస్టులు:3
  • BFSI సెక్టార్ lT సెక్యూరిటీ కన్సల్టెంట్ పోస్టులు: 3
  • క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ కన్సల్టెంట్ పోస్టులు: 1
  • డేటా ఎసెన్షియల్‌: సెంటర్ సెక్యూరిటీ కన్సల్టెంట్ పోస్టులు: 2
  • సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పోస్టులు: 2
  • టీమ్ లీడర్ పోస్టులు: 2
  • సిస్టమ్ స్పెషలిస్ట్ పోస్టులు: 3
  • కన్సల్టెంట్ పోస్టులు: 33
  • మొబైల్ సెక్యురిటీ రీసెర్చర్‌ పోస్టులు: 2
  • సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్ పోస్టులు: 1
  • రెడ్ టీమ్ ఎక్స్‌పర్ట్‌ పోస్టులు: 1
  • Android / IOS సెక్యురిటీ రీసెర్చర్ పోస్టులు: 5
  • ఫర్మ్‌వేర్ రివర్స్ ఇంజనీర్ పోస్టులు: 1
  • సాఫ్ట్‌వేర్ డెవలపర్ పోస్టులు: 1
  • రిమోట్ సెన్సింగ్ డేటా పోస్టులు: 2
  • సిస్టమ్ స్పెషలిస్ట్ పోస్టులు: 1
  • సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పోస్టులు: 2
  • నెట్‌వర్క్ ఇంజనీర్ పోస్టులు: 1
  • జియోస్పేషియల్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పోస్టులు: 2
  • Al/ lVL కన్సల్టెంట్ పోస్టులు: 5

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu