CRPF Recruitment 2022: సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌లో 322 హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు.. ఇంటర్ పాసైన స్త్రీ/పురుష అభ్యర్ధులు అర్హులు..
భారత్ ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్.. 322 హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా, పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల..
భారత్ ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్.. 322 హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా, పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టుల్లో మహిళలకు 65 పోస్టులు, పురుషులకు 257 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. స్పోర్ట్స్‌లో అర్హతలున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 23 యేళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితి విషయంలో సడలింపు వర్తిస్తుంది. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో నోటిఫికేసన్ విడుదలైన 30 రోజుల్లోపు దరఖాస్తులు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ అక్టోబర్ 20, 2022వ తేదీన విడుదలైంది. దరఖాస్తు సమయంలో జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్ధులు రూ.100లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, స్పోర్ట్స్ ట్రైల్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.25,500ల నుంచి రూ.81,100ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.