Indian Navy SSC Officer Recruitment 2022: బీటెక్ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! ఇండియన్ నేవీలో 217 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..పూర్తి వివరాలివే..
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ నేవీ.. 217 షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్సెస్సీ) ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు..
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ నేవీ.. 217 షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్సెస్సీ) ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్/బీఎస్సీ/బీకాం/పీజీ/ఎంబీఏ/ఎంసీఏ/ఎమ్మెస్సీ/ఎంఈ/ఎంటెక్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే దరఖాస్తుదారుల వయసు 21 నుంచి 30 యేళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో సెప్టెంబర్ 6, 2022వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఎంపిక విధానం, జీతభత్యాలు, వయోపరిమితి వంటి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు..
- జనరల్ సర్వీస్ పోస్టులు: 56
- ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ పోస్టులు: 5
- నావెల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్ పోస్టులు: 15
- పైలట్ పోస్టులు: 25
- లాజిస్టిక్స్ పోస్టులు: 20
- ఎడ్యుకేషన్ పోస్టులు: 12
- ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ బ్రాంచ్ పోస్టులు: 70
- నావల్ కన్‌స్ట్రక్టర్ పోస్టులు: 14
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.