Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fact Check: మోడీ ప్రభుత్వం సామాన్యులకు రూ.5 వేల ఆర్థిక సాయం అందజేస్తోందా..? ఇందులో నిజమెంత?

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశంలోని అన్ని వర్గాల వారికి రకరకాల పథకాలను అమలు చేస్తోంది. దీంతో పాటు రైతులు, మహిళలు, విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు..

Fact Check: మోడీ ప్రభుత్వం సామాన్యులకు రూ.5 వేల ఆర్థిక సాయం అందజేస్తోందా..? ఇందులో నిజమెంత?
Fact Check
Follow us
Subhash Goud

|

Updated on: Oct 23, 2022 | 7:37 AM

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశంలోని అన్ని వర్గాల వారికి రకరకాల పథకాలను అమలు చేస్తోంది. దీంతో పాటు రైతులు, మహిళలు, విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పథకాలను ప్రవేశపెడుతోంది. ప్రభుత్వం తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ పథకాల గురించి ప్రజలకు తెలియజేస్తూనే ఉంటుంది. తాజాగా అలాంటి ఓ ప్లాన్ గురించి సోషల్ మీడియాలో ఓ మెసేజ్ వైరల్ అవుతోంది. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ శాఖ ప్రజలందరికీ రూ.5 వేల ఆర్థిక సాయం అందజేస్తోందని ఈ వార్తా సారాంశం. మీరు కూడా ఈ పథకం ప్రయోజనాన్ని పొందాలనుకుంటే దీని కోసం మీరు ఒక ఫారమ్‌ను పూరించాలి. మీరు ఈ సందేశాన్ని, ఫారమ్‌కు లింక్‌పై క్లిక్‌ చేసే ముందు నిజ నిజాలను తెలుసుకోవడం ఎంతో ముఖ్యం.

మోడీ ప్రభుత్వం పీఎం యోజన కింద కింద సామాన్యులకు రూ.5,000 ఆర్థిక సాయం అందజేస్తోందనే ఓ సందేశం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ దీనిపై ప్రభుత్వ ఏజన్సీ అయిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఈ విషయాన్ని వాస్తవాన్ని తనిఖీ చేసింది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని దాని అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌తో పంచుకుంది. వెబ్‌సైట్‌లో చేసిన క్లెయిమ్ పూర్తిగా నకిలీదని పీఐబీ తేల్చి చెప్పింది.ప్రభుత్వం అటువంటి పథకాన్ని ప్రారంభించలేదు, దీని ద్వారా మీకు రూ. 5,000 ఆర్థిక సహాయం అందుతుందనే వార్త పూర్తిగా అబద్దమని స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి లింక్‌లను క్లిక్‌ చేయడం వల్ల మీరు మోసపోయే ప్రమాదం ఉందని, సైబర్‌ నేరగాళ్లు ఇలాంటి ఫేక్‌ న్యూస్‌ను వైరస్‌ చేస్తూ ఆ లింక్‌లను క్లిక్‌ చేయడం వల్ల మీ వ్యక్తిగత వివరాలతో పాటు బ్యాంకు వివరాలు వారికి తెలిసిపోతాయని, దీంతో మీరు నష్టపోయే ప్రమాదం ఉందని పీఐబీ హెచ్చరించింది. ఏదైనా ప్రభుత్వ పథకం గురించి సమాచారాన్ని పొందడానికి ముందుగా మీరు దాని అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చని సూచించింది.

ఈ విధంగా, మీకు ఏదైనా వైరల్ సందేశం గురించి సందేహాలు ఉంటే, మీరు దాని వాస్తవాన్ని తనిఖీ చేయాలనుకుంటే దీని కోసం మీరుFacebook https://factcheck.pib.gov.in/లో అధికారిక లింక్‌ని సందర్శించడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. అదే సమయంలో మీరు pibfactcheck@gmail.comకు ఇమెయిల్ చేయడం ద్వారా లేదా WhatsApp నంబర్ 8799711259కి సందేశం పంపడం ద్వారా పథకాలు, ఇతర సమాచారాన్ని తెలుసుకోవచ్చని తెలిపింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి