కొమ్ములు ఔషధాలలో వినియోగం: ఖడ్గ మృగాల కొమ్ములు వివిధ ఔషధాలలో వినియోగిస్తారట. ఈ ఖడ్గ మృగం కొమ్ములను కత్తిరించి భారీ ధరలకు అమ్ముతుంటారు. ఈ కొమ్ములను పొడిగా తయారు చేసి వివిధ రకాల ఔషధాల్లో ఉపయోగిస్తారు. ఇందులో ఉండే కెరాటిన్ ఔషధాలకు, ఇతర వాటికి ఉపయోగపడతాయి. క్యాన్సర్ వ్యాధి నుంచి హ్యాంగోవర్ వరకు, వివిధ రకాల మందుల తయారీలో ఈ ఖడ్గ మృగం కొమ్ములను ఉపయోగిస్తారని జంతు పరిశోధకులు చెబుతున్నారు. చైనాలో తయారు చేసే ఔషధాల్లో ఈ కొమ్ములను అధికంగా వాడుతారు. వీటిని ఔషధాలలో వాడటం వల్ల వీటికి అంత డిమాండ్ ఉంటుంది. అందుకే స్మగ్లర్లు వీటి గురించి తెలుసుకుని ఖడ్గ మృగాలను వేటాడుతున్నారు.