Malavika Mohanan: బిజీ అవుతున్న బోల్డ్ బ్యూటీ.. మాళవిక మోహనన్ లేటెస్ట్ ఫోటోస్ వైరల్
సౌత్ హీరోయినే అయినా.... గ్లామర్ విషయంలో నార్త్ బ్యూటీస్‌కు కూడా పోటి ఇచ్చే అందాల భామ మాళవిక మోహనన్. కెరీర్‌లో బిగ్ సక్సెస్‌లు లేకపోయినా...
Updated on: Oct 22, 2022 | 4:14 PM

సౌత్ హీరోయినే అయినా.... గ్లామర్ విషయంలో నార్త్ బ్యూటీస్‌కు కూడా పోటి ఇచ్చే అందాల భామ మాళవిక మోహనన్. కెరీర్‌లో బిగ్ సక్సెస్‌లు లేకపోయినా... ఫిలిం సర్కిల్స్‌లో ఈ బ్యూటీ పేరు గట్టిగానే వినిపిస్తుంటుంది. దీంతో ఇప్పుడు వరుస అవకాశాలు మాళవిక తలుపు తడుతున్నాయి.

మాళవిక మోహనన్... హీరోయిన్‌గా ఈ పేరు తెలిసిన వాళ్లు కొంత మందే అయినా... గ్లామర్ క్వీన్‌గా పరిచయమున్న వాళ్ల నెంబర్ మాత్రం భారీగానే ఉంటుంది.

సోషల్ మీడియాలో హీట్ పెంచే ఫోటో షూట్స్‌తో హల్ చల్ చేసే ఈ బ్యూటీ... హీరోయిన్‌గా కన్నా... ఇన్‌స్టా స్టార్ గానే ఎక్కువ పాపులర్.

మాస్టర్, మారన్ లాంటి సినిమాల్లో స్టార్ హీరోల సరసన నటించినా... మాళవికకు పెద్దగా గుర్తింపు రాలేదు. అంతేకాదు ఈ సినిమాల్లో మాళవిక స్క్రీన్ ప్రెజెన్స్ కూడా తన సోషల్ మీడియా ఇమేజ్‌కు కాంట్రస్ట్ కనిపించింది.

దీంతో వెండితెర మీద కనిపించింది, సోషల్ మీడియాలో సందడి చేస్తుంది ఒకరేనా అన్న రేంజ్‌లో డిస్కషన్ జరిగింది.

ఇన్నాళ్లు సినిమాల విషయంలో పెద్దగా బజ్ లేకపోయినా... ఇప్పుడు సీన్ మారిపోయింది. వరుసగా టాప్ స్టార్స్ సినిమాలో మాళవిక పేరు రిపీటెడ్‌గా వినిపిస్తోంది.

ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్‌గా ఫిక్స్ అయినట్టే అన్నది ఫిలిం నగర్ టాక్.

తాజాగా మరో గోల్డెన్ ఛాన్స్ ఈ బ్యూటీని వెతుక్కుంటూ వచ్చింది. విక్రమ్ హీరోగా పా రంజిత్ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ పాన్ ఇండియా సినిమా కోసం ముందు రష్మికను హీరోయిన్‌గా ఫిక్స్ చేశారు.

కానీ డేట్స్ అడ్జస్ట్ కాకపోవటంతో ఇప్పుడు ఆ ప్లేస్‌లో మాళవికను సెలెక్ట్ చేశారు. లక్కీగా కలిసొచ్చిన ఈ పాన్ ఇండియా ఆఫర్‌ను పర్ఫెక్ట్‌గా వాడుకునేందుకు రెడీ అవుతున్నారు మాళవిక.




