- Telugu News Photo Gallery Political photos Pm narendra modi performs puja at kedarnath temple in uttarakhand
PM Modi: ప్రధాని మోడీ కేదార్‌నాథ్ ఆలయ సందర్శన.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోస్
ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించారు.
Phani CH |
Updated on: Oct 21, 2022 | 3:14 PM

ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించారు.

ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాని మోడీ రాకతో కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాలను సుమారు రెండు క్వింటాళ్ల పూలతో సుందరంగా అలంకరించారు.

ఆలయం సందర్శన నేపథ్యంలో మోడీ సంప్రదాయ పహాడీ దుస్తుల్లో కనిపించారు.

హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా మహిళలు తయారు చేసిన దుస్తులను ఆయన ధరించారు. అయితే ప్రధాని మోడీ కేదార్‌నాథ్‌ను సందర్శించడం ఇది ఆరోసారి.

ఆలయ సందర్శన నేపథ్యంలో రోప్‌వే ప్రాజెక్టుకు మోడీ శంకుస్థాపన చేయనున్నారు. గౌరీ కుండ్ నుంచి కేదార్‌నాథ్, గోవింద్‌ఘట్ నుంచి హేమకుండ్ సాహిబ్‌లను కలుపుతూ రెండు కొత్త రోప్‌వే ప్రాజెక్టును అందుబాటులోకి రానున్నాయి.

3,400 కోట్లతో కేంద్ర సర్కార్ కొత్త రోప్‌వే ప్రాజెక్టులను చేపడుతోంది. ఇక్కడ జరుగుతున్న పలు అభివృద్ధి పనులను మోడీ పరిశీలించనున్నారు.

అలాగే ఆదిగురువు శంకరాచార్యుల సమాధి స్థలాన్ని సందర్శించనున్నారు. కేదార్‌నాథ్‌లోని మందకి అస్తపథం, సరస్వతీ అస్తి పథాలను పరిశీలిస్తారు.





























