Inflation: పెరుగుతున్న ద్రవ్యోల్బణం, బలపడుతున్న డాలర్.. మరి బంగారం కొనొచ్చా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..

బంగారం కొనేందుకు మంచి సమయం ఏది అంటే అందరూ ముందుగా చెప్పేది ధనత్రయోదశి. దీపావళి పండగకు ముందు బంగారాన్ని కొనడం చాలా మంది శుభసూచకంగా..

Inflation: పెరుగుతున్న ద్రవ్యోల్బణం, బలపడుతున్న డాలర్.. మరి బంగారం కొనొచ్చా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Gold Price
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 22, 2022 | 4:36 PM

బంగారం కొనేందుకు మంచి సమయం ఏది అంటే అందరూ ముందుగా చెప్పేది ధనత్రయోదశి. దీపావళి పండగకు ముందు బంగారాన్ని కొనడం చాలా మంది శుభసూచకంగా భావిస్తుంటారు. కొనుగోలు సందడి అలా ఉంచితే పెరుగుతున్న ద్రవ్యోల్బణం నుంచి రక్షణగా బంగారం నిలుస్తుందనే నమ్మకం చాలా మంది ఉంది. ఈ సిద్ధాంతం ఈసారి నిజమైన పరీక్షను ఎదుర్కొబోతోంది.

ఈ ఏడాది ఇప్పటి వరకు ద్రవ్యోల్బణం పెరుగుతూనే ఉంది. అదే సమయంలో గడిచిన ఆరునెలలుగా అంటే సెప్టెంబర్‌ వరకు బంగారం ధర తగ్గుతూ వస్తోంది. మార్చిలో పసిడి ధర పెరిగింది. అదే సమయంలో డాలర్‌ పుంజుకోవడంతో బంగారం నేలచూపులు చూడటం మొదలుపెట్టింది. అయినప్పటికీ మిగిలిన పెట్టుబడి సాధనాలతో పోల్చితే గోల్డ్‌ – తన స్టాండర్డ్‌ను కాపాడుకుంటునే ఉంది. గతేడాది దీపావళి నుంచి ఇప్పటి వరకు లెక్కించినట్టు అయితే దాదాపు 7 శాతం రాబడిని బంగారం అందించింది. ఈక్విటీ, బాండ్లతో పోల్చితే ఇది మెరుగైన రిటర్న్‌గా చెప్పవచ్చు. ఇదే సమయంలో నిఫ్టీ 50 ఇండెక్స్‌లో పెట్టిన పెట్టుబడిపై రాబడి ఏ మాత్రం రాకపోగా అది 4 శాతం తగ్గింది. బాండ్స్‌లో పెట్టుబడి పెట్టిన వారు కూడా ఏ మాత్రం రాబడి అందుకోలేకపోయారు. కాబట్టి పెట్టుబడిని పదిలంగా ఉంచడమే కాదు దానిపై రాబడి అందించడంలోనూ బంగారానికి తిరుగులేదని మార్కెట్‌ నిపుణులు అంటారు.

బలపడుతున్న డాలర్‌ – బంగారానికి ప్రతిబంధం..

దీర్ఘకాలిక దృష్టితో చూస్తే బంగారంపై ఆందోళనలు యథాతథంగా ఉన్నాయి. అదే సమయంలో అనూహ్యంగా డాలర్‌ బలపడుతుండటంతో భవిష్యత్‌లోబంగారం ఎలా ఉంటుందనే దానిపై అనిశ్చితి తాండవిస్తోంది. పెరుగుతున్న డాలర్‌ విలువ బంగారానికి ప్రతిబంధకంగా నిలుస్తోందని వల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ గత నెలలో విడుదల చేసిన నివేదిక స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

పెరుగుతున్న వడ్డీ రేట్లు బంగారంలో పెట్టుబడికి ప్రధాన అడ్డంకిగా మారుతోంది. అయినప్పటికీ ఈ ధన్‌తేరస్‌ రోజున బంగారం కొనడం మంచిదేనని నిపుణులు సలహా ఇస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో అనిశ్చితి రాజ్యమేలుతూ వడ్డీ రేట్లు పెరుగుతూ ఉన్న క్రమంలో పెట్టుబడి సాధనంగా బంగారం బెటరనే మాటలు మార్కెట్‌లో వినిపిస్తున్నాయి. అయితే పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ఈసారి ఆభరణాల అమ్మకాలు అంతగా ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రపంచంలోనే అతి పెద్ద బంగారం వినియోగదారు ఇండియా. చాలా మంది ఇండియన్స్‌ మెచ్చే ఇన్వెస్ట్‌మెంట్‌ టూల్‌ గోల్డ్‌. స్టాక్‌ మార్కెట్‌ ఎప్పుడూ ఒడిదొడుకులతో ఉంటుంది, సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిణామాలు వాటిని ప్రభావితం చేస్తూ ఉంటాయి. అదే సమయంలో రియల్‌ ఎస్టేట్‌ అన్నది దీర్ఘకాలిక పెట్టుబడి సాధనంగా పరిగణిస్తారు. పోర్టుఫోలియోకు స్టెబిలిటీ అందిస్తూ కాలంతో పాటు భూముల విలువలు పెరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఒడిదొడుకుల ప్రభావం తక్కువగా ఉండి, అవసరమైన సందర్భంలో వదిలించుకునే వెసులుబాటు సులభంగా ఉంటుంది కాబట్టి చాలా మంది ఇండియన్స్‌కు గోల్డ్‌ అనేది బెటర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆప్షన్‌గా నిలుస్తోంది.

20 ఏళ్ల గరిష్ఠ స్థాయిలో డాలర్‌..

ప్రస్తుతం డాలర్‌ విలువ 20 ఏళ్ల గరిష్ఠ స్థితిలో ఉంది. అది బలహీనపడితే బంగారం ధర పెరిగే సూచనలున్నాయి. డాలర్‌ విలువ ఒక శాతం తగ్గితే బంగారం ధర 0.88 % పెరుగుతుంది. అంతే కాదు డాలర్‌ బలహీనపడితే మిగిలిన రిస్క్‌ అసెట్స్‌ తల్లడిల్లవచ్చు. అది బంగారానికి పాజిటివ్‌గా ఉంటుందన్నది వల్డ్ గోల్డ్‌ కౌన్సిల్‌ అభిప్రాయం.

ఇండియాలో గత నెల బంగారం డిమాండ్‌ పెరిగింది. ఈ నెలలోనూ అది కంటిన్యూ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. అంతర్జాతీయంగా ధరలు ఇంకొంత తగ్గితే బంగారం కోసం వెచ్చించే మొత్తాన్ని కొనుగోలుదారులు పెంచవచ్చు. సో, ఇప్పుడు ట్రెండ్‌ చూస్తే మిగిలిన ఇన్వెస్ట్‌మెంట్‌ టూల్స్‌ కంటే గోల్డ్‌ ఈజ్‌ బెటర్‌ అనేది మార్కెట్‌ నిపుణుల మాట.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..