Pink Eye: కళ్లు గులాబీ రంగులోకి మారాయా..? అయితే బీ అలెర్ట్.. వ్యాధి, దాని లక్షణాలు ఏమిటో తెలుసుకోండి..
వర్షాకాలం నుంచి చలికాలం మొదలైంది. వాతావరణం మారుతున్న క్రమంలో ప్రజలు రకరకాల ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారు. జలుబు, దగ్గు, జ్వరం సహా సీజనల్ వ్యాధుల ప్రమాదం పెరుగుతున్నాయి.
వర్షాకాలం నుంచి చలికాలం మొదలైంది. వాతావరణం మారుతున్న క్రమంలో ప్రజలు రకరకాల ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారు. జలుబు, దగ్గు, జ్వరం సహా సీజనల్ వ్యాధుల ప్రమాదం పెరుగుతున్నాయి. కంటి సమస్యలు కూడా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. చాలామంది కండ్లకలక లేదా పింక్ ఐ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య కూడా చాలా వేగంగా పెరుగుతోంది. ఈ వ్యాధి చాలా మందిలో అరుదుగా కనిపిస్తుంది. ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య పెరుగుతుండటంతో వైద్యులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. నిరంతరం వాతావరణ మార్పుల కారణంగా ఈ వ్యాధి ప్రజలను తన వశం చేసుకుంటోందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పింక్ ఐ లక్షణాలు..
ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా వాతావరణంలో తేమశాతం పెరిగిందని వైద్యులు చెబుతున్నారు. దీని వల్ల ఒకరి ఇంటి నుంచి మరొకరి ఇంటికి అంటు వ్యాధులు వేగంగా చేరుతున్నాయి. అటువంటి పరిస్థితిలో కండ్లకలక లేదా కంటి ఎరుపు (పింక్ ఐ) సమస్య సాధారణంగా ప్రజలలో కనిపిస్తుంది. పింక్ ఐ సమస్యతో బాధపడుతున్న వ్యక్తి కళ్లు ఎర్రగా మారి బరువుగా అనిపించడం ప్రారంభమవుతుంది. అలాగే కళ్లలో వాపుతో పాటు దురద కూడా మొదలవుతుంది.
ఐ కాంటాక్ట్ ను నివారించండి..
పింక్ ఐ సమస్యతో బాధపడుతున్న వ్యక్తులు ప్రకాశవంతమైన కాంతితో ఇబ్బంది పడుతున్నారు. అదే సమయంలో వైద్యుల సలహా ప్రకారం.. మీ కళ్ళను పదే పదే తాకవద్దు. కళ్ళను పదే పదే నలుపకుండా ఉండాలి. దీనితో పాటు, పదేపదే నీటితో కళ్లను కడగడం కొనసాగించండి. సమస్య తీవ్రమైతే వెంటనే నిపుణులైన వైద్యుడిని సంప్రదించండి. ఇంకా ఎవరికైనా కండ్ల కలక లాంటివి ఉంటే.. వారికి (ఐ కాంటాక్ట్) దూరంగా ఉండండి.. వారికి సంబంధించిన వస్తువులకు దూరంగా ఉండటం మంచిది. దీనిద్వారా సాధ్యమైనంత వరకు నివారించవచ్చు.
కండ్లకలక నివారణకు మార్గాలు..
- ఇంట్లో పరిశుభ్రత పాటించండి.
- మీ చేతులతో కళ్ళను తాకడం మానుకోండి.
- మీ వస్తువులను ఎవరితోనూ పంచుకోవద్దు.
- వీలైనంత తరచుగా మీ చేతులను శుభ్రం చేసుకోవాలి.
- వ్యాధిని నివారించేందుకు ఎదుటివారితో దూరం పాటించాలి.
చికిత్స ఎలా చేయాలి?
మీరు కండ్లకలక సమస్యతో బాధపడుతున్నట్లయితే ఖచ్చితంగా ఒకసారి వైద్యుడిని సంప్రదించండి. కండ్లకలక అనేక రకాలు ఉన్నప్పటికీ.. ప్రతి ఒక్కరి చికిత్స కూడా భిన్నంగా ఉంటుంది. కానీ చాలా సందర్భాలలో అది స్వయంగా నయమవుతుంది. కొన్ని సందర్భాల్లో తీవ్రమవుతుంది. కావున వైద్యులను సంప్రదించడం మంచింది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం..