AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tattoo – Blood Donation: అందరిలో పెరుగుతున్న టాటూ క్రేజ్.. పచ్చబొట్టు వేయించుకున్న వారు రక్తదానం చేయొచ్చా..? 

ఈ రోజుల్లో దాదాపు అన్ని వయస్సుల వారు తమ శరీరంపై పచ్చబొట్లు వేసుకుంటున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు చాలామంది శరీరంలోని వివిధ భాగాల్లో రకరకాల డిజైన్లతో టాటూలు వేయించుకుంటారు.

Tattoo - Blood Donation: అందరిలో పెరుగుతున్న టాటూ క్రేజ్.. పచ్చబొట్టు వేయించుకున్న వారు రక్తదానం చేయొచ్చా..? 
Tattoo Blood Donation
Shaik Madar Saheb
|

Updated on: Oct 24, 2022 | 11:29 AM

Share

టాటూ వేయించుకోవడం అనేది నేటి ఫ్యాషన్.. జీవనశైలిలో ఒక భాగం. పిల్లలు, యువత ఇలా అందరూ టాటూల క్రేజ్‌తో మురిసిపోతుంటారు. ఇందులో మహిళలు కూడా ముందంజలోనే ఉన్నారు. మీకు కూడా టాటూలు వేసుకోవడం ఇష్టం అయితే, ముందు కొన్ని విషయాలు తెలుసుకోవడం మంచిది. టాటూలు వేయించుకున్న తర్వాత చాలాసార్లు రక్తదానం చేసేందుకు బయటకు వెళ్తుంటారు. అయితే ఇది చాలా ప్రమాదకరమని మీకు తెలుసా..? లేదంటే టాటూ వేయించుకున్న తర్వాత శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా..? అసలు టాటూ వేయించుకున్న తర్వాత రక్తదానం ఎందుకు చేయలేకపోతున్నారు..? కారణాలు ఏంటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

శరీరంపై పచ్చబొట్టు ప్రభావం

ఈ రోజుల్లో దాదాపు అన్ని వయస్సుల వారు తమ శరీరంపై పచ్చబొట్లు వేసుకుంటున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు చాలామంది శరీరంలోని వివిధ భాగాల్లో రకరకాల డిజైన్లతో టాటూలు వేయించుకుంటారు. పచ్చబొట్టు వేయించుకున్న తర్వాత, ప్రజలకు ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని చిట్కాలు కూడా ఇస్తారు. అన్నింటిలో మొదటిది, రక్తానికి సంబంధించిన ఏదైనా వ్యాధి గురించి సమాచారం. ఇలాంటి సమస్య ఉంటే.. వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. టాటూ వేయించుకున్న తర్వాత రక్తదానం చేయకూడదని చాలా మంది నమ్ముతారు. పచ్చబొట్టు వేయించుకున్న తర్వాత కొంత సమయం వరకు రక్తదానం చేయకూడదని కొందరు పేర్కొంటుంటారు. అదే సమయంలో టాటూ వేయించుకున్న తర్వాత రక్తాన్ని దానం చేయలేమని కొందరు చెబుతారు.. అందులో నిజానిజాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఇవి కూడా చదవండి

ఏడాది పాటు రక్తదానం చేయడం మానుకోండి

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. టాటూ వేయించుకున్న వెంటనే రక్తదానం చేయడం మనకు చాలా ప్రమాదకరం. పచ్చబొట్లు వేయడానికి ఉపయోగించే సూదులు, సిరాతో హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, హెచ్‌ఐవి వంటి అనేక రక్త సంబంధిత వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. వాస్తవానికి, టాటూలు వేయడానికి ఉపయోగించే సూది ప్రతి వ్యక్తికి విడి విడిగా ఉపయోగించరు. అటువంటి పరిస్థితిలో, రక్త సంబంధిత వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. టాటూలకు సంబంధించి స్థిరమైన మార్గదర్శకం లేనందున ఇది జరుగుతుంది.

ఈ విషయాలను గుర్తుంచుకోండి

ఒకవేళ మీరు టాటూ వేయించుకోవాల్సి వస్తే, మంచి పార్లర్ నుంచి వేయించుకోవడానికి ప్రయత్నించండి. అలాగే పరిశుభ్రతపై కూడా శ్రద్ధ వహించాలి. మీరు టాటూ వేయించుకున్న అనంతరం కనీసం 1 సంవత్సరం తర్వాత మాత్రమే రక్తదానం చేయాలి. అమెరికన్ రెడ్‌క్రాస్ సొసైటీ ప్రకారం.. మీరు ఏ రకమైన టాటూ వేసుకున్నా కనీసం 12 నెలల వరకు రక్తదానం చేయకూడదు. అలాగే, కొత్త సిరంజిలతో టాటూలు వేయించుకోండి.

కుట్లు వేసిన తర్వాత రక్తదానం చేయవద్దు

ఇంకా ఆపరేషన్ లేదా కుట్లు వేసిన తర్వాత కూడా రక్తదానం చేయడం నిషేధం. అయితే, కుట్లు వేయడంలో ఎలాంటి రక్త మార్పిడి ప్రమాదం ఉన్నా జాగ్రత్తగా ఉండాలి. చాలా రోజుల పాటు ఇన్ఫెక్షన్ లేదా వాపు మొదలైనవి ఉంటే, అది ఒక వారంలో మీ శరీరంపై దాని ప్రభావాన్ని చూపుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..