AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాక్ తో చర్చలు జరపాలన్న వారిపై మనోజ్ సిన్హా సంచలన వ్యాఖ్యలు.. ఉగ్రవాదుల కంటే వీరే డేంజర్ అంటూ..

జమ్మూ కాశ్మీర్‌ను ఈ  స్థాయికి తీసుకొచ్చింది వీరే. తీవ్రవాదంతో ప్రత్యక్ష సంబంధాలున్న వారి కంటే.. ఇలా పరోక్ష గొడవలకు కారణం అవుతున్న వారే ఎక్కువ నేరస్తులని తాను  నమ్ముతున్నానని మనోజ్ సిన్హా చెప్పారు.

పాక్ తో చర్చలు జరపాలన్న వారిపై మనోజ్ సిన్హా సంచలన వ్యాఖ్యలు.. ఉగ్రవాదుల కంటే వీరే డేంజర్ అంటూ..
J&K Lieutenant Governor Manoj Sinha
Surya Kala
|

Updated on: Oct 27, 2022 | 8:26 AM

Share

జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పాకిస్థాన్‌తో చర్చలు జరపాలని డిమాండ్ చేసే రాజకీయ నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. ఉగ్రవాదంతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉన్న వారి కంటే ఇలాంటి వ్యక్తులే ముఖ్య దోషులని ఆయన అన్నారు. నిరంతరం జమ్మూ కశ్మీర్ లో ఒక స్థాయిలో ఉగ్రవాదం, హింస ఉంటే తప్ప ఢిల్లీలో ఎవరూ పట్టించుకోరని తెలిసి ఇక్కడ అశాంతికి కారణం అవుతున్నారన్నారు.

పాకిస్థాన్‌తో చర్చలు జరపకపోతే ఇక్కడ బాగుండదు అనే విధంగా భావించాలని కొందరు ప్రయత్నిస్తున్నారని మనోజ్ సిన్హా అన్నారు. జమ్మూ కాశ్మీర్‌ను ఈ  స్థాయికి తీసుకొచ్చింది వీరే. తీవ్రవాదంతో ప్రత్యక్ష సంబంధాలున్న వారి కంటే.. ఇలా పరోక్ష గొడవలకు కారణం అవుతున్న వారే ఎక్కువ నేరస్తులని తాను  నమ్ముతున్నానని మనోజ్ సిన్హా చెప్పారు. ఒక స్థాయి ఉగ్రవాదం కొనసాగితే తప్ప ఢిల్లీలో గుర్తింపు ఉండదనే వారి గురించి ప్రజలు అర్థం చేసుకున్నారని తాను అనుకుంటున్నానని చెప్పారు.

కాశ్మీరీ పండిట్లే లక్ష్యంగా ఉగ్రవాదులు  లోయలో టెర్రరిస్టులు కాశ్మీరీ పండిట్లను నిరంతరం టార్గెట్ చేస్తున్నారని చెప్పారు. తీవ్రవాదుల లక్షిత దాడుల దృష్ట్యా, దక్షిణ కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాకు చెందిన 10 కాశ్మీరీ పండిట్ కుటుంబాలు భయంతో తమ ఇళ్లను విడిచిపెట్టారని గుర్తు చేసుకున్నారు. కాశ్మీర్‌లో కశ్మీరీ పండిట్లను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేస్తున్న ఘటనలు ఇటీవలి కాలంలో గణనీయంగా పెరగడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

చౌదరి గుండు వాసులు మాట్లాడుతూ.. ఇటీవల తీవ్రవాదుల దాడులు పెరిగిపోవడంతో సమాజంలో ఉద్రిక్తత, భయాందోళన వాతావరణం నెలకొంది. ఇక్కడ 1990ల నుండి కాశ్మీర్‌లో నివసిస్తున్నారు. అయితే  వీరు కష్ట సమయాల్లో తమ ఇళ్లను విడిచిపెట్టలేదు. అక్టోబరు 15న షోపియాన్ జిల్లాలోని చౌదరిగుండ్ గ్రామంలో కాశ్మీరీ పండిట్ పురాణ్ కృష్ణ భట్‌ను ఇంటి బయట ఉగ్రవాదులు కాల్చి చంపారు. అదే సమయంలో అక్టోబరు 18న షోపియాన్ జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన గ్రెనేడ్ దాడిలో మోనిష్ కుమార్, రామ్ సాగర్ చనిపోయారు.

బలవంతంగా గ్రామాన్ని విడిచి పెట్టిన కాశ్మీర్ పండితులు: చౌదరి గుండ్ గ్రామానికి చెందిన వ్యక్తి,..  ఇటీవల హత్యకు సంబంధించి బెదిరింపులను ఎదుర్కొన్నాడు. 10 కాశ్మీరీ పండిట్ కుటుంబాలు అంటే 35 నుండి 40 మంది సమాజానికి చెందిన వ్యక్తులు భయం , ఉద్రిక్తత కారణంగా గ్రామాన్ని విడిచిపెట్టారు. గ్రామం ఇప్పుడు ఖాళీగా ఉంది. కాశ్మీర్ లోయలో ఇప్పుడు మనం నివసించడానికి అనుగుణంగా ఉన్న పరిస్థితి లేదని మరో గ్రామస్థుడు చెప్పాడు. నిత్యం జరుగుతున్న హత్యల వల్ల భయంతో జీవిస్తున్నాం. మాకు ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేయలేదని తెలిపారు. తమకు భద్రత కల్పించాలని పలుమార్లు విన్నవించినా తమ గ్రామానికి దూరంగా పోలీసు పోస్టును ఏర్పాటు చేశారని గ్రామస్తులు ఆరోపించారు. యాపిల్ పంటతో పాటు తమ ఇళ్లలోను వదిలి వేరే ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..