AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OYO Video Leak Case: మీ ప్రైవేటు వీడియోలు లీక్ అయ్యాయా? ముందు చేయాల్సిన పని ఇదే..

నోయిడాలోని ఓ ఓయో హోటల్‌లో జంటల ప్రైవేటు వీడియోలు లీక్ అయిన ఉదంతం సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేసిన..

OYO Video Leak Case: మీ ప్రైవేటు వీడియోలు లీక్ అయ్యాయా? ముందు చేయాల్సిన పని ఇదే..
Private Video
Shiva Prajapati
|

Updated on: Oct 27, 2022 | 8:14 AM

Share

నోయిడాలోని ఓ ఓయో హోటల్‌లో జంటల ప్రైవేటు వీడియోలు లీక్ అయిన ఉదంతం సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే, ఓయో ఈ విషయంలో అంతర్గత దర్యాప్తు ప్రారంభించింది. ఈ విచారణలో ఓయో సిబ్బంది తప్పేమీ లేదని తేలింది. అయితే, ఈ దుశ్చర్యకు పాల్పడిన నిందితులిద్దరూ గత నెలలో ఫేజ్3 పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న హోటల్‌లో బస చేశారు. గది నుంచి బయటకు వెళ్లే ముందు అక్కడ సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు. ఆ గదిలోకి వచ్చిన జంటల ప్రైవేటు వీడియోలను రికార్డ్ చేశారు.

ఆ తరువాత మరోసారి సేమ్ గదిని బుక్ చేసుకుని వెళ్లారు. అక్కడ అమర్చిన కెమెరాను తీసుకున్నారు. అయితే, ఆ వీడియోల ఆధారంగా సదరు జంటలను నిందితులు బ్లాక్ మెయిల్ చేశారు. వారి వీడియోలను సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దాంతో బాధితులు పోలీసులకు సమాచారం అందించగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల, విష్ణు సింగ్, అబ్దుల్ వహాబ్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఓయో ఉద్యోగుల ప్రమేయం లేదు.. ఘటనపై హోటల్ సిబ్బందిని ప్రశ్నించామని, ఈ ఘటనలో వారి పాత్ర వెల్లడి కాలేదని ఏడీసీపీ తెలిపారు. ఈ ఘటనలో హోటల్, సిబ్బంది ప్రమేయం లేదని స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఓయో అంతర్గత విచారణ జరుపుతోంది.

ఇవి కూడా చదవండి

ప్రైవేట్ వీడియో లీక్ అయితే ఏమి చేయాలి? మీ ప్రైవేట్ వీడియో లీక్ అయితే వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేయాలి. లేదంటే https://cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చు. మీకు సంబంధించిన వీడియోను ఎక్కడ చూసినా, మీరు స్క్రీన్‌షాట్, URL లింక్‌ను సేవ్ చేసి, పోలీసులకు లేదా సైబర్ క్రైమ్‌కు ఇవ్వవచ్చు, మీ వద్ద ఎంత ఎక్కువ సమాచారం ఉంటే, మూలాన్ని కనుగొనడంలో అది మరింత సహాయపడుతుంది. అలాగే, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్, యూట్యూబ్‌లో దుర్వినియోగానికి సంబంధించిన వివరాలు కూడా పోలీసులకు అందించాలి.

ప్రైవేట్ వీడియోలు వైరల్ చేయడం నేరం.. వ్యక్తుల ప్రైవేట్ వీడియోను వైరల్ చేయడం చాలా పెద్ద నేరం. దీని కోసం చట్టంలో కఠిన చర్యలు తీసుకోవాలనే నిబంధన ఉంది. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 354సీ, ఐటీ చట్టం కింద కేసు నమోదు చేస్తారు. ఈ సెక్షన్ కింద ఏడాది నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష, నేరం రుజువైతే జరిమానా విధించే అవకాశం ఉంది. ఐటీ చట్టంలో వివిధ సెక్షన్లు ఉన్నాయి. అన్నింటికీ వేర్వేరు శిక్షలకు నిబంధనలు ఉన్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..