Finger Pain: కంప్యూటర్ టైపింగ్‌తో వేళ్లు నొప్పులా.? ఈ సింపుల్‌ టిప్స్‌ ఫాలో అయితే నొప్పి పరార్‌..

ప్రస్తుతం శ్రమకు అర్థం మారిపోతోంది. ఒకప్పుడు విపరీతంగా శ్రామిక శ్రమ చేసేవారు. కానీ ఇప్పుడు పని తీరు మారుతోంది. కంప్యూటర్ల ముందు కూర్చుని పని చేసే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఏసీలు, హాయిగా కూర్చొని పని చేయొచ్చు ఏముంది అనేవారు కూడా ఉంటారు. అయితే..

Finger Pain: కంప్యూటర్ టైపింగ్‌తో వేళ్లు నొప్పులా.? ఈ సింపుల్‌ టిప్స్‌ ఫాలో అయితే నొప్పి పరార్‌..
Finger Pain
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 03, 2022 | 10:55 AM

ప్రస్తుతం శ్రమకు అర్థం మారిపోతోంది. ఒకప్పుడు విపరీతంగా శ్రామిక శ్రమ చేసేవారు. కానీ ఇప్పుడు పని తీరు మారుతోంది. కంప్యూటర్ల ముందు కూర్చుని పని చేసే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఏసీలు, హాయిగా కూర్చొని పని చేయొచ్చు ఏముంది అనేవారు కూడా ఉంటారు. అయితే.. కంప్యూటర్‌ల ముందు గంటల కొద్ది కూర్చొవడం వల్ల వచ్చే సమస్యలు అన్నీఇన్నీ కావు. వీటిలో ఒకటి వేళ్ల నొప్పులు. గంటల తరబడి టైపింగ్ చేసే వాళ్లకి వేళ్‌లు నొప్పులు పుడుతుంటాయి. అయితే ఈ సమస్యకు చెక్‌ పెట్టడానికి కొన్ని సింపుల్‌ ఎక్సర్‌సైజ్‌లు ఫాలో అయితే సరిపోతుంది. ఇంతకీ ఆ వ్యాయామాలు ఏంటంటే..

* ఎక్కువ సేపు టైపింగ్ చేసే వారికి సాఫ్ట్‌ బాల్‌ను నొక్కడం ద్వారా రిలీఫ్‌ ఉంటుంది. బాల్‌ను పది సెకన్ల పాటు నొక్కి అలాగే ఉంచాలి. కనీసం 10 నుంచి 13 సార్లు ఇలా చేస్తే వేళ్ల నొప్పులు తగ్గుతాయి.

* సహజంగా కంప్యూటర్‌ల ముందు కూర్చునే వారు అదే పనిగా వర్క్‌ చేస్తుంటారు. అలా కాకుండా కొద్ది సమయం బ్రేక్‌ ఇస్తుండాలి. ఇలా బ్రేక్‌ సమయంలో చేతి పిడికిలిని తెరిచి వేళ్లను వీలైనంత వరకు సాగదీయాలి. మళ్లీ పిడికిలిని మూయాలి. ఇలా రిపీట్‌గా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

* అప్పుడప్పుడు చేతులను ముందుకు చాచి మణికట్టును చుట్టూ తింపాలి. క్లాక్‌ వైజ్‌ డైరెక్షన్‌లో, యాంటీ క్లాక్‌ వైజ్‌ డైరెక్షన్‌లో పిడికిలి బిగించి మణికట్టును తిప్పాలి. ఇలా చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.

* రెండు చేతుల వేళ్లను ఒకదాంట్లో ఒకటి పెట్టి గట్టిగా ప్రెస్‌ చేయండి. ఇలా 4 నుంచి 5 సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. వేళ్ల నొప్పులు తగ్గుతుంది.

* చేతి వేళ్లను అప్పుడప్పుడు కదిలించాలి. ఒకే శైలిలో గంటల తరబడి టైపింగ్ చేస్తే వేళ్లలో నరాలు పట్టుకున్నట్లై నొప్పి వస్తుంది. కాబట్టి కొంచెం గ్యాప్‌ ఇస్తూ చేతి వేళ్లను ఆడిస్తుండాలి.

నోట్‌: పైన తెలిపిన సమాచారం కేవలం ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. వేళ్ల నొప్పులు మరీ ఎక్కువైతే వైద్య నిపుణులను సంప్రదించడమే ఉత్తమమం.

మరిన్ని హెల్త్ ఆర్టిక్సల్ కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?