Seasonal Fever: వాతావరణంలో మార్పులతో జ్వరం, గొంతు నొప్పితో ఇబ్బంది పడుతున్నారా.. జీవనశైలిని మార్చుకోండి

వాతావరణం మారినప్పుడల్లా .. ప్రజల ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం చూపుతుందని అన్నారు. ఒక నివేదికలో, "ఉష్ణోగ్రతలో మార్పు వివిధ సమూహాల వైరస్లు వృద్ధి చెందడానికి తగిన పరిస్థితిని కలిపిస్తుంది.. అంటు వ్యాధులను వ్యాప్తి చేస్తుందని చెప్పారు. 

Seasonal Fever: వాతావరణంలో మార్పులతో జ్వరం, గొంతు నొప్పితో ఇబ్బంది పడుతున్నారా.. జీవనశైలిని మార్చుకోండి
Seasonal Fever
Follow us
Surya Kala

|

Updated on: Oct 03, 2022 | 8:40 AM

ప్రస్తుతం ఈ సీజన్ లో వాతావరణంలో మార్పులు ఏర్పడతాయి. ఉష్ణోగ్రతలో మార్పు కారణంగా.. జలుబు, ఫ్లూ, ఇతర సీజనల్ ఆరోగ్య సమస్యలతో బారిన పడే ప్రమాదం ఉంది. వైద్య పరిశోధన ప్రకారం .. ఏడాదిలో పెద్దవారు  ప్రతి సంవత్సరం 2-4 సార్లు, పిల్లలు 5-7 సార్లు జలుబు బారిన పడతారు. వాతావరణం మారినప్పుడు ఒకొక్కసారి మరింత అధికంగా జలుబు బారిన పడిన సందర్భాలు ఉన్నాయి. ఇలా జరగడానికి ఒక కారణం ఉంది. సీజన్ మారిన ప్రతిసారీ, వాతావరణంలోని అలెర్జీ కారకాల సంఖ్య గాలిలో దాదాపు 200 వైరస్‌లు వ్యాపిస్తాయి.

సర్వోదయ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లోని సీనియర్ కన్సల్టెంట్, ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ , జనరల్ ఫిజీషియన్ డాక్టర్ సుమిత్ అగర్వాల్ మాట్లాడుతూ రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నారు ఉష్ణోగ్రతలో మార్పులతో అనారోగ్యం బారిన పడతారని అన్నారు.  “ఉష్ణోగ్రతలో స్వల్ప మార్పు కూడా వారికి కష్టతరంగా మారుతుంది. దగ్గు, జలుబు , వైరల్ ఫీవర్ వంటి సాధారణ సమస్యల బారిన పడవచ్చు అన్నారు. “వృద్ధులకు, చిన్న పిల్లలో అయితే ఆరోగ్యం పరిస్థితి మరింత దిగజారుతుంది.

హౌరాలోని నారాయణ్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ జనరల్ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్ నీలాంజన్ పట్రాన్‌బిస్ మాట్లాడుతూ వాతావరణం మారినప్పుడల్లా .. ప్రజల ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం చూపుతుందని అన్నారు. ఒక నివేదికలో, “ఉష్ణోగ్రతలో మార్పు వివిధ సమూహాల వైరస్లు వృద్ధి చెందడానికి తగిన పరిస్థితిని కలిపిస్తుంది.. అంటు వ్యాధులను వ్యాప్తి చేస్తుందని చెప్పారు.

ఇవి కూడా చదవండి

రక్షించుకునే విధానం: జలుబు, ఫ్లూ నేడు సాధారణ ఆరోగ్య సమస్యలు అయినప్పటికీ..  ప్రారంభంలో జాగ్రత్త తీసుకోకపోతే ఆరోగ్యానికి హానికరంగా మారవచ్చు.  బాధితులు ఆసుపత్రిలో కూడా చేరవలసి ఉంటుంది. అయితే కొన్ని జాగ్రత్తలు, జీవనశైలిలో మార్పులు చేసుకుంటే సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.

పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ: వైరస్ లు శరీరం వెలుపల 3 గంటల వరకు జీవించగలవు. కొన్నిసార్లు డోర్ నాబ్‌లు లేదా లైట్ స్విచ్‌లు వంటివి చేతులతో తాకిన వస్తువులపై 48 గంటల వరకు జీవించగలవు. అందువల్ల.. సీజనల్ వ్యాధుల వ్యాప్తి ప్రమాదాన్ని నివారించడానికి మీరు మీ చేతులను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అంతేకాదు చేతులను ముఖాన్ని తాకించుకోకుండా చూసుకోవాలి.

వ్యాయామం క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వ్యక్తుల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అందువలన వైరల్ ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం తక్కువ.

ఆరోగ్యంగా తినండి, బాగా నిద్రించండి సమతుల ఆహారం తీసుకోవడం, తగినంత నిద్రపోవడం, ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడం వంటివి సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ ఇస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..