Rain Alert: నిప్పుల వర్షం కురవాల్సిన మిడ్ మార్చి.. వేసవిలో వడగండ్ల వర్షం ఎందుకో తెలుసా?
మార్చి 2026 రెండవ, మూడో వారాల్లో తెలంగాణలో అసాధారణ వర్షాలు, ఉరుములు, మెరుపులు, వడగళ్లు పడ్డాయి. వికారాబాద్ జిల్లా పరిగి మండలం ఇబ్రహీంపూర్, గడిసింగపూర్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం, వడగళ్ల వాన నమోదయ్యాయి. మరో నాలుగు రోజులు రాష్ట్రవ్యాప్తంగా వానలే వానలు అంటోంది వాతావరణ శాఖ.

మార్చి 2026 రెండవ, మూడో వారాల్లో తెలంగాణలో అసాధారణ వర్షాలు, ఉరుములు, మెరుపులు, వడగళ్లు పడ్డాయి. వికారాబాద్ జిల్లా పరిగి మండలం ఇబ్రహీంపూర్, గడిసింగపూర్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం, వడగళ్ల వాన నమోదయ్యాయి. మరో నాలుగు రోజులు రాష్ట్రవ్యాప్తంగా వానలే వానలు అంటోంది వాతావరణ శాఖ. వడగళ్ల వానలతో అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఇక మార్చి 16 నుంచి 19 వరకు కురిసిన వర్షాలకు వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో తీవ్ర వడగళ్లు, ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో కొన్ని జిల్లాల్లో రైతులు నష్టపోతున్నారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రోజులకు యెల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఖమ్మం, వికారాబాద్, రంగారెడ్డి, వనపర్తిలో ఇప్పటికే వర్షాలు కురుస్తుండగా.. సంగారెడ్డి, కామారెడ్డి, ములుగు, నాగర్ కర్నూలు, సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందంటున్నారు అధికారులు. ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వానలు కురుస్తాయని.. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, వడగండ్ల వానలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అలాగే 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలు కూడా ఉన్నాయంటోంది. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లో ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయంటోంది. క్యుములస్ మేఘాలు చల్లని పొడి మేఘలు లాంటివి తక్కువ ఎత్తులో ఏర్పడతాయని అధికారులు తెలిపారు. అయితే క్యుములోనింబస్ మేఘాలు ఎత్తైనవి. బలమైన ఎగసిన గాలులతో ఏర్పడి భారీ వర్షాలు, వడగళ్లు, ఉరుములు, మెరుపులు తీసుకొస్తాయి. ఈ మేఘాల్లో నీటి బిందువులు మంచు రూపంలో మారి వడగళ్లుగా పడతాయి.
మఖ్యంగా ఎండాకాలంలో భూమి ఆగ్నేయ గాలులు వేడెక్కిస్తాయి. తక్కువ స్థాయి మాన్సూన్ ప్రవాహాలు బెంగాల్ ఖాడీ నుంచి తేలికపాటి తడితో కలిసి క్యుములోనింబస్ మేఘాలు ఏర్పరుస్తాయి. ఉష్ణోగ్రతలు 36-40°సెల్సియస్ ఉన్నప్పుడు ఈ మేఘాలు తీవ్రమైన వడగాల్పులు, వడగళ్లు ఏర్పడతాయి. తెలంగాణలో మార్చి నెలలో ఇలాంటివి సాధారణం. ఈ వర్షాల వల్ల వికారాబాద్‌తో పాటు సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట్‌లో వర్షాలు కురుస్తున్నాయి. అకాల వర్షాలు రైతులకు కడగండ్లు మిగులుస్తున్నాయి. ముఖ్యంగా జొన్న, చెరుకు పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లితోంది.
వీడియో ఇక్కడ చూడండి..
మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 36°సెల్సియస్ కంటే తగ్గాయి. మరో మార్చి 20 వరకు వాతావరణ శాఖ ప్రత్యేక అలర్ట్‌లు జారీ చేసింది. మార్చి 20 నుంచి క్రమంగా ఎండలు పెరిగే అవకాశం ఉందని . అయితే ఇక తేడాది కంటే ఈ ఏడాది ఎండల తీవ్రత మరి ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
