AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OverSleeping: అతిగా నిద్రపోయే అలవాటు ఉందా..? అయితే, ఆ ప్రమాదం పొంచి ఉన్నట్లే..

నిద్ర ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ప్రతిరోజూ శరీర అవసరానికి అనుగుణంగా నిద్రించడం వల్ల ఆరోగ్యంగా ఉండటంతోపాటు అలసట నుంచి ఉపశమనం పొందుతారు. దీంతో శరీరం రీఫ్రెష్‌ అవుతుంది.

OverSleeping: అతిగా నిద్రపోయే అలవాటు ఉందా..? అయితే, ఆ ప్రమాదం పొంచి ఉన్నట్లే..
Sleeping
Shaik Madar Saheb
|

Updated on: Oct 03, 2022 | 6:39 PM

Share

నిద్ర ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ప్రతిరోజూ శరీర అవసరానికి అనుగుణంగా నిద్రించడం వల్ల ఆరోగ్యంగా ఉండటంతోపాటు అలసట నుంచి ఉపశమనం పొందుతారు. దీంతో శరీరం రీఫ్రెష్‌ అవుతుంది. అదే సమయంలో, నిద్ర లేకపోవడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యల గురించి మీరు తప్పక వినే ఉంటారు. అయితే ఎక్కువగా నిద్రపోవడం వల్ల కలిగే హాని గురించి మీకు తెలుసా..? తెలియకపోతే ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోండి. రోజూ 8 గంటల కన్నా.. ఎక్కువ గంటలపాటు నిద్రపోతే అది ఆరోగ్యానికి హానికరంగా మారుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అతిగా నిద్రపోవడం వల్ల కలిగే నష్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

అతిగా నిద్రపోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది.. అది ఎన్నో సమస్యలకు దారి తీస్తుంది..

గుండె సమస్యలకు కారణం కావచ్చు: తక్కువ నిద్రపోవడం వల్ల మనిషికి అనేక వ్యాధులు వస్తాయి. కానీ ఎక్కువ నిద్రపోవడం వల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు పెరిగే అవకాశం ఉంది. ఇది మాత్రమే కాదు మీరు అవసరమైన దానికంటే ఎక్కువ నిద్రపోతే, స్ట్రోక్ సమస్య ఉండవచ్చు. కాబట్టి మీకు ఎక్కువగా నిద్రపోయే అలవాటు ఉంటే ఈరోజే మార్చుకోవాలని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

డిప్రెషన్ సమస్య: ఇది వినడానికి మీకు వింతగా అనిపించి ఉంటుంది. కానీ అతిగా నిద్రపోవడం వల్ల అది మెదడుపై ప్రభావం పడుతుంది. దీని కారణంగా ఒక వ్యక్తి డిప్రెషన్‌లోకి కూడా వెళ్లవచ్చు. ఎందుకంటే ఎక్కువ నిద్రపోవడం వల్ల మనిషి శారీరక శ్రమ తగ్గుతుంది. దీని కారణంగా మీ మానసిక స్థితి కూడా ప్రభావితమవుతుంది.

ఊబకాయం సమస్య: నిద్ర – ఊబకాయం మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంది. అందువల్ల ఎక్కువ నిద్రపోవడం వల్ల ఊబకాయానికి గురయ్యే అవకాశం పెరుగుతుంది. రోజులో 8 గంటల కంటే ఎక్కువ నిద్రపోవడం వల్ల ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు వంటి వ్యాధులు చుట్టుముడుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.

మధుమేహం వచ్చే ప్రమాదం: అతిగా నిద్రపోవడం మీ రక్తంలో చక్కెర స్థాయికి పెరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ నిద్రపోయినప్పుడు.. శరీరం చక్కెరను ప్రాసెస్ చేసే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది మధుమేహానికి దారితీస్తుంది.

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం..