Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes: షుగర్‌ బాధితులు కొబ్బరి నీరు తాగొచ్చా..? లేదా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

చాలా మంది ప్రజలు కొబ్బరి నీరు తాగడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా వేసవి కాలంలో ఎక్కువగా తాగుతారు. ఎందుకంటే ఇది వడదెబ్బ నుంచి రక్షిస్తుంది.

Diabetes: షుగర్‌ బాధితులు కొబ్బరి నీరు తాగొచ్చా..? లేదా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Coconut Water
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 02, 2022 | 2:13 PM

చాలా మంది ప్రజలు కొబ్బరి నీరు తాగడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా వేసవి కాలంలో ఎక్కువగా తాగుతారు. ఎందుకంటే ఇది వడదెబ్బ నుంచి రక్షిస్తుంది. రుచికరమైన కొబ్బరి నీటిని ఆరోగ్యకరమైన పానీయంగా పరిగణిస్తారు. దీనిలో సహజ చక్కెర ఉంటుంది. కావున డయాబెటిక్ పేషెంట్లు ఈ సహజ పానీయాన్ని తాగవచ్చా..? లేదా..? అని చాలాసార్లు గందరగోళానికి గురవుతారు. దీన్ని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుందని చాలామంది పేర్కొంటుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో డయాబెటిస్‌ బాధితులు కొబ్బరి నీరు తాగొచ్చా.. లేదా.. అనే విషయాలను తెలుసుకుందాం..

కొబ్బరి నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..

కొబ్బరి నీరు ఆరోగ్యకరమైన పానీయంగా పేర్కొంటారు. ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. దీని కారణంగా ఊబకాయం, కొలెస్ట్రాల్ స్థాయిలు పెద్దగా పెరగవు. ఇది హైడ్రేషన్‌ నుంచి రక్షిస్తుంది. కాబట్టి వేడి వాతావరణంలో ఎక్కువగా తాగడానికి సలహా ఇస్తారు. ముఖ్యంగా సముద్రం చుట్టూ, వాతావరణం తేమగా ఉంటుంది. దీని కారణంగా చెమట ఎక్కువగా పట్టడంతోపాటు.. కొన్ని సందర్భాల్లో రక్తం కూడా బయటకు వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొబ్బరినీళ్లు తాగితే శరీరంలో నీటి కొరత ఉండదు. అలాగే, ఇందులో శరీరానికి ఎంతో మేలు చేసే అనేక పోషకాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

అనేక పరిశోధనలు, అధ్యయనాల ప్రకారం.. నిత్యం కొబ్బరి నీళ్ళు తాగే వ్యక్తిలో ఎలక్ట్రోలైట్ అసమతుల్యత ప్రమాదం చాలా వరకు తగ్గిపోతుందని నిరూపితమైంది. ఎలక్ట్రోలైట్స్ అనేవి మన శరీర శక్తిని నిర్వహించడానికి సహాయపడే ఖనిజాలు.

డయాబెటిక్ రోగులకు కొబ్బరి నీరు ప్రయోజనకరంగా ఉంటుందా?

కొబ్బరి నీళ్లు తీపిగా ఉంటాయి. ఎందుకంటే ఇందులో సహజ చక్కెర ఉంటుంది. కాబట్టి ఈ పానీయం డయాబెటిక్ రోగులకు కూడా ఆరోగ్యకరమైనదా లేదా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుందా అనే ప్రశ్న తరచూ తలెత్తుతుంది. అయితే, డయాబెటిక్ రోగులకు కొబ్బరి నీళ్ల వినియోగం సాధారణంగా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీని ద్వారా రక్తంలో చక్కెర స్థాయిని కూడా నియంత్రించవచ్చని చాలా జంతువులపై చేసిన పరిశోధనలో తేలింది. కొబ్బరి నీళ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ 55 కంటే తక్కువగా ఉంటుంది. కావున ఇది డయాబెటిక్ రోగులకు హానికరం కాదంటున్నారు. అయితే, వైద్యుని సలహా మేరకు రోజూ ఎంత మోతాదులో తాగాలో నిర్ణయించుకోవాలని సూచిస్తున్నారు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం..