AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid: కరోనా ఎన్నో అనుభవాలను నేర్పింది.. వాతావరణ మార్పులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ కీలక వ్యాఖ్యలు

కోవిడ్ మహమ్మారి ఎన్న అనుభవాలను నేర్పిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ తెలిపారు. పర్యావరణ సమతుల్యతతోనే ప్రజల జీవితాలు ముడిపడి ఉన్నాయని చెప్పారు. ఓ వార్తా సంస్థకు..

Covid: కరోనా ఎన్నో అనుభవాలను నేర్పింది.. వాతావరణ మార్పులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ కీలక వ్యాఖ్యలు
Dr Soumya Swaminathan
Amarnadh Daneti
|

Updated on: Oct 03, 2022 | 6:26 PM

Share

కోవిడ్ మహమ్మారి ఎన్న అనుభవాలను నేర్పిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ తెలిపారు. పర్యావరణ సమతుల్యతతోనే ప్రజల జీవితాలు ముడిపడి ఉన్నాయని చెప్పారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె వాతావరణ మార్పుల కారణంగా సంబంవించే వ్యాధులపై మాట్లాడుతూ.. వాతావరణ మార్పులతో కలిగే దుష్ప్రభావాలు ఎలా ఉంటాయో కరోనా మహమ్మారి అనేక పాఠాలు నేర్పిందన్నారు. ఈ మార్పుల వల్ల బలహీన వర్గాల వారే ఎక్కువ ఇబ్బంది పడుతున్నారని ఆమె అన్నారు. కరోనా మహమ్మారి ప్రజలకు తగిన గుణపాఠం చెప్పిందని అన్నారు. ప్రజల ఆరోగ్యం పర్యావరణంతో ముడిపడి ఉందనే విషయాన్ని గుర్తు చేసిందన్నారు. ప్రధానంగా పర్యావరణ మార్పు, మరుగునపడిపోతున్న మానవ తప్పిదాలను మనకు అవగతమయ్యేలా చేసిందని తెలిపారు. పాకిస్థాన్‌ వరదల గురించి కూడా సౌమ్య నాథన్ మాట్లాడుతూ.. వాతావరణ మార్పులకు ఏ దేశమైనా మినహాయింపు కాదని తెలిపారు. అయితే ప్రభుత్వాలు అందరికి సమాన సదుపాయాలు అందించడంపైనే దృష్టి సారించాలని సూచించారు.

కరోనా టీకాల గురించి సౌమ్య స్వామినాథన్ మాట్లాడుతూ.. వ్యాక్సిన్ వల్ల నష్టాల కంటే ప్రయోజనాలే అధికంగా ఉన్నాయన్నారు. 20, 21వ శతాబ్దంలో వాటి వల్ల ఎన్నో ప్రాణాలు పోకుండా కాపాడామన్నారు. 10 లక్షల్లో 3 నుంచి 4 ప్రతికూల కేసులుంటాయని, అలాగే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా వైరస్‌ బారినపడే అవకాశం ఉంటుందని, అయితే వ్యాధి తీవ్రతను మాత్రం తగ్గిస్తాయని ఆమె తెలిపారు. ముఖ్యంగా కరోనా విషయంలో టీకాల కారణంగా చాలా మంది త్వరగా కోలుకుంటున్నారని, ప్రపంచవ్యాప్తంగా 13 బిలియన్ల మంది టీకా వేయించుకున్నారని చెప్పారు. సుమారు 20 మిలియన్ల మంది ప్రాణాలు కాపాడుకున్నామని సౌమ్య స్వామినాథన్ వివరించారు. అమెరికాలో వ్యాక్సినేషన్‌కు దూరంగా ఉన్నవారిలోనే మరణాలు ఎక్కువగా నమోదయ్యాయని తెలిపారు. అధిక సామర్థ్యం, అత్యంత భద్రతా ప్రమాణాలతో టీకాలను రూపొందించారని పేర్కొన్నారు.

కొంతమంది టీకాలు తీసుకోకపోయినా.. అనారోగ్యానికి గురికాని అన్నారు. అయితే ఎక్కువ సార్లు అది సాధ్యం కాదని తెలిపారు. కరోనా టీకా విషయంలో భారత్ ను సౌమ్య స్వామినాథన్ ప్రశంసించారు. కోవిద్ రెండో దశలో ఎక్కువ మందికి వ్యాక్సినేషన్ కాలేదని, అందుకే కోవిడ్ మహమ్మారి ప్రభావం అధికంగా కనిపించిందన్నారు. మరోవైపు కరోనా బూస్టర్డ డోసుపై అనేక విమర్శలు వస్తున్న నేపథ్యంలో వాటిని ఆమె ఖండిస్తూ.. ప్రతి ఒక్కరూ బూస్టర్ డోసు తీసుకోవాలని కోరారు. త్వద్వారా వైరస్ ప్రభావం తగ్గుతుందన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..