Bomb Threat: చైనాలో సేఫ్‌గా ల్యాండయిన ఇరాన్ విమానం.. రంగంలోకి భారత వాయుసేన.. అసలేమైందంటే..?

భారత గగనతలంలో తీవ్ర కలకలం రేపిన ఇరాన్‌కు చెందిన మహాన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం ఎట్టకేలకు చైనాలో సేఫ్‌గా ల్యాండయ్యింది. గ్వాంగ్‌జౌ ఎయిర్‌పోర్ట్‌లో ఈ విమానం ల్యాండయ్యింది.

Bomb Threat: చైనాలో సేఫ్‌గా ల్యాండయిన ఇరాన్ విమానం.. రంగంలోకి భారత వాయుసేన.. అసలేమైందంటే..?
Bomb Threat On Plane
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 03, 2022 | 5:32 PM

భారత గగనతలంలో తీవ్ర కలకలం రేపిన ఇరాన్‌కు చెందిన మహాన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం ఎట్టకేలకు చైనాలో సేఫ్‌గా ల్యాండయ్యింది. గ్వాంగ్‌జౌ ఎయిర్‌పోర్ట్‌లో ఈ విమానం ల్యాండయ్యింది. ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ నుంచి చైనా లోని గ్వాంగ్‌జౌకు బయలుదేరిన విమానం బాంబు ఉందని వార్త రావడంతో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ చేసేందుకు పైలట్‌ ప్రయత్నించారు. అయితే.. ఢిల్లీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అనుమతి కోరగా.. కొన్ని సాంకేతిక కారణాలతో అధికారులు నిరాకరించారు. ఈ విమానం రాజస్థాన్‌ లోని జోధ్‌పూర్‌లో లేదా చండీఘడ్‌ ఎయిర్‌పోర్ట్‌లో దిగేందుకు అనుమతి ఇచ్చారు. అయితే పైలట్లు అందుకు నిరాకరించారు. ఆతర్వాత విమానం చైనా వైపు వెళ్లిపోయింది. చివరకు మహాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం సేఫ్‌గా ల్యాండ్‌ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఇరాన్‌ విమానంలో బాంబు ఉన్నట్టు పాకిస్తాన్‌ నుంచి ఫోన్‌కాల్‌ వచ్చినట్టు గుర్తించారు. అయితే.. మహాన్ ఎయిర్ విమానానికి బాంబు బెదిరింపు వచ్చినప్పుడు అది భారత గగనతలంలో ఉండటంతో.. అధికారులు అప్రమత్తమయ్యారు. భారత ఎయిర్‌స్పేస్‌లో ఉన్నప్పుడు ఆ విమానాన్ని సుఖోయ్‌ యుద్ద విమానాలు వెంబడించాయి. అయితే.. విమానంలో బాంబు ఉన్నట్టు నిర్ధారణ కాలేదని భారత ఎయిర్‌ఫోర్స్‌ కూడా ప్రకటించింది.

మహన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఢిల్లీ గగనతలం వైపు కదులుతున్నప్పుడు ముప్పు గురించి పైలట్‌కు సమాచారం అందించినట్లు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారి తెలిపారు. భారత గగనతలం అంతటా ఈ విమానం నిశితంగా రాడార్ నిఘాలో ఉందని IAF వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

475 మంది ప్రయాణీకుల సామర్థ్యం ఉన్న ఎయిర్‌బస్ A340 విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని, సమయానికి గ్వాంగ్‌జౌ చేరుకుందని అధికారులు తెలిపారు. బాంబు బెదిరింపు కాల్ నకిలీదని మహన్ ఎయిర్ ట్విట్టర్‌లో ఒక ప్రకటనలో తెలిపింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.