రోడ్డుపై కిర్రాక్ స్టంట్లు చేసిన హైదరాబాద్ కుర్రోడు.. దిమ్మతిరిగే షాకిచ్చిన చెన్నై పోలీసులు.. చివరికి..!

హైదరాబాద్‌కు చెందిన ఓ యూట్యూబర్.. తమిళనాడు రాజధాని చైన్నై రోడ్లపై స్నేహితులతో కలిసి ప్రమాదకర స్టంట్లు చేశాడు.. ఆ తర్వాత కొందరి ఫిర్యాదుతో సీన్ రివర్స్ అయింది.

రోడ్డుపై కిర్రాక్ స్టంట్లు చేసిన హైదరాబాద్ కుర్రోడు.. దిమ్మతిరిగే షాకిచ్చిన చెన్నై పోలీసులు.. చివరికి..!
Bike Stunt
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 03, 2022 | 3:19 PM

హైదరాబాద్‌కు చెందిన ఓ యూట్యూబర్ తమిళనాడు రాజధాని చైన్నై రోడ్లపై స్నేహితులతో కలిసి ప్రమాదకర స్టంట్లు చేశాడు.. ఆ తర్వాత కొందరి ఫిర్యాదుతో సీన్ రివర్స్ అయింది. అందరినీ అరెస్టు చేసి పోలీసులు జైలుకు తరలించారు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలైన ప్రధాన నిందితుడు హైదరాబాద్‌కు చెందిన యువకుడితో పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రోడ్డు భద్రతా చర్యలు పాటించాలని అందరికీ తెలియజెసేలా అతను స్టంట్లు చేసిన ప్రాంతంలోనే అతనితో కరపత్రాలు, ప్లకార్డులు పట్టించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యం నెట్టింట వైరల్ అవుతోంది. బైక్ పై ప్రమాదకర స్టంట్లు చేస్తూ పట్టుబడిన కోట్లా అలెక్స్ బినోయ్ అనే యూట్యూబర్‌ రోడ్లపై కరపత్రాలు పంచుతూ కనిపించాడు. ఇతను ఆగస్టులో చైన్నై సిటీ రోడ్లపై నిర్వహించిన బైక్ స్టంట్‌ల కేసులో మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు.

Chennai

Chennai

ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం కోట్లా అలెక్స్ బినోయ్, అతని స్నేహితులు డీఎంకే కార్యాలయం ఎదురుగా ఉన్న తేనాంపేట్ రోడ్డులో ప్రమాదకరమైన స్టంట్లు చేస్తూ ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పడేసారు. ఆ తర్వాత ఈ వీడియోలను యూట్యూబ్‌లో పెట్టాడు. ఇది చూసిన కొందరు వీడియోలను షేర్ చేస్తూ చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. దీంతో కేసు నమోదు చేసిన చెన్నై పోలీసులు ముందుగా అతని బృందాన్ని పట్టుకున్నారు. అసలు దీనికి కారణమైన కోట్ల అలెక్స్ బినోయ్‌ పరారయ్యాడు. అనంతరం హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అతన్ని పట్టుకుని జైలుకు తరలించారు.

ఇవి కూడా చదవండి

ఈ కేసులో బెయిల్ పొందిన అనంతరం కోట్ల అలెక్స్ బినాయ్‌కు పోలీసులు సామాజిక బాధ్యత తెలిసొచ్చేలా పలు కార్యక్రమాలను రూపొందించారు. దీనిలో భాగంగా సోమవారం తేనాంపేట సిగ్నల్ వద్ద రోడ్డు భద్రత కరపత్రాలను పంచేలా చేశారు. అదేవిధంగా ప్రధాన సిగ్నల్ దగ్గర రోడ్డు భద్రతపై ప్లకార్డు పట్టుకుని కనిపించాడు.

వీడియో చూడండి..

కాగా.. గత కొన్ని రోజుల నుంచి చెన్నై నగరంలో కొందరు పోకిరిలు ప్రమాదకర స్టంట్లు చేస్తూ.. ప్రయాణికులను భయభ్రాంతులకు చేస్తున్నారు. అలాంటి వారిపై పోలీసులు కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే