Health Tips: కండలు తిరిగిన శరీరం కోసం కసరత్తులు చేస్తున్నారా..? అయితే, ఈ హెల్తీ ప్రొటీన్‌ ఫుడ్స్‌ తీసుకోండి..

నేటి వేగవంతమైన జీవితంలో మనమందరం మనల్ని మనం ఆరోగ్యంగా చూసుకోవడం మరచిపోతాం. దీని కారణంగా మన శరీరంలో చాలాసార్లు ప్రోటీన్లు, విటమిన్లు, అనేక అవసరమైన పోషకాల లోపం ఏర్పడుతుంది.

Health Tips: కండలు తిరిగిన శరీరం కోసం కసరత్తులు చేస్తున్నారా..? అయితే, ఈ హెల్తీ ప్రొటీన్‌ ఫుడ్స్‌ తీసుకోండి..
Health Tips
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 02, 2022 | 1:51 PM

నేటి వేగవంతమైన జీవితంలో మనమందరం మనల్ని మనం ఆరోగ్యంగా చూసుకోవడం మరచిపోతాం. దీని కారణంగా మన శరీరంలో చాలాసార్లు ప్రోటీన్లు, విటమిన్లు, అనేక అవసరమైన పోషకాల లోపం ఏర్పడుతుంది. ఆహారం సరిగ్గా తీసుకోకపోతే ప్రోటీన్ లోపం ఏర్పడుతుంది. దీని కారణంగా రక్తహీనత వంటి తీవ్రమైన వ్యాధులు శరీరంలో తలెత్తుతాయి. శరీరంలో తగినంత ప్రోటీన్ లేకపోవడం వల్ల బలహీనత, కండరాల బలహీనత లాంటి సమస్యలు వస్తాయి. అయితే మంచి శరీర ఆకృతి కోసం రోజూ వ్యాయామం చేస్తూ మాంసాహారం తీసుకోవాలని కొంతమంది సూచిస్తారు. దీనివల్ల శరీర ఆకృతి అందంగా మారి.. ఫిజికల్ ఫిట్నెస్ మెరుగుపడుతుందని చెబుతారు. ఇలాంటి పరిస్థితుల్లో మాంసాహారం కంటే శాఖాహారమే చాలామంచిదని చాలామంది ఆరోగ్య నిపుణులు సిఫారసు చేస్తున్నారు. సాధారణంగా మాంసాహారం కంటే శాకాహారంలో తక్కువ ప్రోటీన్ అనుకుంటారని.. కానీ అది కరెక్ట్ కాదని పేర్కొంటున్నారు. ప్రోటీన్లు పుష్కలంగా ఉండే కొన్ని శాఖాహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

పనీర్: పనీర్ చాలా పాపులర్ ఫుడ్. దీనలో పుష్కలంగా ప్రోటీన్ ఉంటుంది. ఇది కాకుండా ఇందులో మంచి మొత్తంలో కాల్షియం కూడా ఉంటుంది. మీ ఆహారంలో పన్నీర్ తప్పనిసరిగా చేర్చకుంటే బలం చేకూరుతుందని పేర్కొంటున్నారు.

బీన్స్: బీన్స్‌లో ఎన్నో పోషకాలున్నాయి. అందుకే దీనిని ఇష్టంగా తింటారు. బీన్స్‌లో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. కావాలంటే వీటిని ఉడకబెట్టి కూడా తినవచ్చు.

ఇవి కూడా చదవండి

పప్పుధన్యాలు: పప్పుధాన్యాలు ఏవైనా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అన్నింటిలో ప్రోటీన్, ఫైబర్, అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కావాలంటే రోటీ లేదా అన్నంతో వీటిని తినొచ్చు.

శనగలు: శనగలు తీసుకోవడం శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. వీటిలో ఐరన్, క్యాల్షియం, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది. రెగ్యులర్‌గా వీటిని తినడం వల్ల షుగర్ లెవెల్ అదుపులో ఉంటుంది.

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే