Health: మగ వాళ్ల ఆరోగ్యానికి జీడిపప్పు బెస్ట్ ఫుడ్.. ఇంకా ఎన్నో అద్భుత ప్రయోజనాలు
డ్రై ఫ్రూట్స్ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం మనకు తెలిసిందే. వీటిలో ముఖ్యంగా జీడిపప్పు గురించి చెప్పుకోవాలి. రుచికరంగా ఉండటంతో పాటు అద్భుత ఆరోగాన్ని అందించే కాజూ ను...
డ్రై ఫ్రూట్స్ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం మనకు తెలిసిందే. వీటిలో ముఖ్యంగా జీడిపప్పు గురించి చెప్పుకోవాలి. రుచికరంగా ఉండటంతో పాటు అద్భుత ఆరోగాన్ని అందించే కాజూ ను ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. భారతీయ వంటల్లో జీడిపప్పు వినియోగం అధికమే. అయితే వీటిని అధికంగా తినడం వల్ల శరీరంలో అనవసర కొవ్వు పెరిగిపోతుందని, తద్వారా గుండె సంబంధిత సమస్యలు వస్తాయని భయపడుతుంటారు. వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందని, అవయవాల పనితీరు మెరుగవుతాయని నిపుణులు చెబుతున్నారు. చర్మం ప్రకాశవంతంగా మారేందుకు, మగవారిలో సంతానోత్పత్తికి అవసరమైన వీర్య కణాలను వృద్ధి చేసేందుకు జీడిపప్పు ఉపయోగపడుతుంది. అంతే కాకుండా శృంగార ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వేరుశనగ, బాదంపప్పుల్లో ఉన్న విధంగా వీటిలోనూ పోషకాలు అధికంగా ఉంటాయి. గర్భిణీలు తమ డైట్ లో కాజూను చేర్చుకుంటే మంచి లాభాలు ఉంటాయి. జీడిపప్పుల్లో అధిక కేలరీలతో పాటు శరీరానికి అవసరమైన కొవ్వు ఆమ్లాలు కూడా ఉంటాయి. విటమిన్స్ ఏ, ఇ, కే, రాగి, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్ ప్రోటీన్లు, పిండి పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి.
జీడిపప్పులో ఉండే పోషకాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్యాటీ యాసిడ్స్ రక్త నాళాలు బలంగా తయారయ్యేందుకు ఉపయోగపడతాయి. కొలెస్ట్రాల్ తగ్గించి బీపీని కంట్రోల్ చేస్తుంది. అయితే వీటిని మోతాదుకు మించి తీసుకుంటే మాత్రం కొవ్వు పేరుకుపోయే ప్రమాదం ఉంది. జీడిపప్పులోని మెగ్నీషియం, పొటాషియం రక్తంలోని చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. ఇందులో కేలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు జీడిపప్పును రోజుకు కేవలం 3-4 వరకే తినాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇన్ఫెక్షన్స్ బారి నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. కండరాలకు అవసరమయిన కొల్లాజెన్ ని అందించి, కండరాలను దృఢంగా ఉండేలా చేస్తుంది.
నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించేముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం..