Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: హైదరాబాద్‌కు రానున్న ప్రధాని మోడీ.. UNWGIC అంతర్జాతీయ సదస్సులో కీలక ప్రసంగం..

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్టోబర్ 11న హైదరాబాద్‌ రానున్నారు. నగరంలో జరగనున్న యూనైటెడ్ నేషన్స్ వరల్డ్ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ (UNWGIC) లో ప్రధాని మోడీ కీలక ప్రసంగం చేయనున్నారు.

PM Modi: హైదరాబాద్‌కు రానున్న ప్రధాని మోడీ.. UNWGIC అంతర్జాతీయ సదస్సులో కీలక ప్రసంగం..
Pm Modi
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 03, 2022 | 5:11 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్టోబర్ 11న హైదరాబాద్‌ రానున్నారు. నగరంలో జరగనున్న యూనైటెడ్ నేషన్స్ వరల్డ్ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ (UNWGIC) లో ప్రధాని మోడీ కీలక ప్రసంగం చేయనున్నారు. ఈ అంతర్జాతీయ సదస్సును ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసింది. గ్లోబల్ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్‌పై నిపుణులు, డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రతినిధులు పలు అంశాలపై సుధీర్ఘంగా చర్చించనున్నారు. హైదరాబాద్ నగరంలోని హెచ్ఐసీసీ వేదికగా ఈ నెల 10వ తేదీ నుంచి14 వరకు యుఎన్‌డబ్ల్యూజీఐసీ అంతర్జాతీయ రెండో సదస్సు జరగనుంది. దాదాపు 120 దేశాల నుంచి 700కి పైగా డెలిగేట్‌లతో సహా 2,000 మంది ప్రతినిధులు అంతర్జాతీయ సమావేశానికి హాజరుకున్నారు. ఈ సమావేశం రెండో రోజు ప్రధాని మోడీ.. హాజరై కీలక ప్రసంగం చేయనున్నారు.

UNWGIC 2022 ప్రధాన ఉద్దేశం.. భౌగోళిక, పర్యావరణ అంశాలతో స్థిరమైన అభివృద్ధి, మానవజాతి శ్రేయస్సు కోసం నిర్వహిస్తున్నారు. పర్యావరణ – వాతావరణ సవాళ్లను పరిష్కరించడానికి సమగ్ర భౌగోళిక సమాచారం ప్రాముఖ్యతను ఈ సదస్సు ప్రతిబింభిస్తుంది. ప్రస్తుత డిజిటల్ కాలంలో సాంకేతిక అభివృద్ధిని స్వీకరించి.. శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థను నెలకొల్పేలా ప్రణాళిక రచించనున్నారు. అదేవిధంగా.. ఉత్పాదకతను పెంచడం, స్థిరమైన మౌలిక సదుపాయాల ప్రణాళిక, సమర్థవంతమైన పరిపాలన, వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేలా జియోస్పేషియల్ టెక్నాలజీని అనుసంధానించడంపై చర్చించనున్నారు.

భారతదేశం ఇటీవలి కాలంలో అన్ని రంగాల్లో సాధించిన పురోగతిని కూడా ఈ సదస్సులో చర్చించనున్నారు. సమీకృత జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్, దాని సామర్థ్యాలు, అభివృద్ధి, సాంకేతిక పటిష్టతకు సంబంధించిన అంశాలను కూడా చర్చించనున్నారు. జియోస్పేషియల్ సేవలను గ్రామాలను అనుసంధానించే విధంగా పలు నిర్ణయాలు తీసుకోనున్నట్లు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. కాగా. భారతదేశ జియోస్పేషియల్ ఎకానమీ 2025 నాటికి 12.8% వృద్ధి రేటుతో రూ.63,100 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా.. సీఎం కేసీఆర్‌ జాతీయ పార్టీ ప్రకటన వార్తల మధ్య ప్రధాని మోదీ హైదరాబాద్‌లో పర్యటించనుండడంతో రాజకీయాలు మరోసారి ఆసక్తికరంగా మారాయి. ఈ నేపథ్యంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయా అని రాజకీయ నేతలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..