AIIMS Bibinagar Jobs 2022: తెలంగాణలోని బీబీనగర్‌ ఎయిమ్స్‌లో ఉద్యోగావకాశాలు.. ఈ అర్హతలుంటే నేరుగా ఇంటర్వ్యూ ద్వారా..

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన తెలంగాణలోని బీబీనగర్‌లోనున్న ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌.. సీనియర్‌ రెసిడెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..

AIIMS Bibinagar Jobs 2022: తెలంగాణలోని బీబీనగర్‌ ఎయిమ్స్‌లో ఉద్యోగావకాశాలు.. ఈ అర్హతలుంటే నేరుగా ఇంటర్వ్యూ ద్వారా..
AIIMS Bibinagar
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 03, 2022 | 6:24 PM

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన తెలంగాణలోని బీబీనగర్‌లోనున్న ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌.. 8 సీనియర్‌ రెసిడెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అనస్తేషియాలజీ, డెర్మటాలజీ, జనరల్‌ మెడిసిన్‌, కమ్యునిటీ మెడిసిన్‌ అండ్‌ ఫ్యామిలీ మెడిసిన్‌, పిడియాట్రిక్స్‌ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ఎంబీబీఎస్‌తోపాటు సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ, ఎండీ, ఎంఎస్, డీఎం, ఎంసీహెచ్‌, డీఎన్బీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు 45 యేళ్లకు మించకుండా ఉండాలి.

ఈ అర్హతలున్నవారు కింది ఈమెయిల్‌కు అక్టోబర్‌ 25, 2022వ తేదీలోపు దరఖాస్తులను పంపించవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో జనరల్‌ అభ్యర్ధులు రూ.1500లు, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్ధులు రూ.1200లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. నవంబర్‌ 2, 3 తేదీల్లో కింది అడ్రస్‌లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ప్రతిభకనబరచిన వారికి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర పూర్తి సమాచారం కోసం అధికారిక నోటిఫికేషన్‌ చెక్‌ చేసుకోవచ్చు.

ఈమెయిల్ ఐడీ: sr.aiimsbibinagar@gmail.com

ఇవి కూడా చదవండి

ఇంటర్వ్యూ అడ్రస్: ఆడిటోరియం, 2వ ఫ్లోర్‌, ఎయిమ్స్‌ బీబీనగర్‌ 508126.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.