NLC Recruitment 2022: నెలకు రూ.95 వేల జీతంతో నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండా ఎంపిక..
భారత ప్రభుత్వ రంగానికి చెందిన తమిళనాడులోని నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్.. 19 సీనియర్ రెసిడెంట్, జూనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల..
భారత ప్రభుత్వ రంగానికి చెందిన తమిళనాడులోని నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్.. 19 సీనియర్ రెసిడెంట్, జూనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఎమర్జెన్సీ మెడిసిన్, డయాబెటాలజీ, పిడియాట్రిక్స్, ఈఎన్‌టీ, ఆర్థోపెడిక్స్, ఆబ్స్‌స్టేట్రిక్స్ అండ్ గైనకాలజీ, రేడియోలజీ, ఆప్తల్మాలజీ, అనెస్తీషియాలజీ, సైకియాట్రి, జెరియాట్రిక్ మెడిసిన్ తదితర విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్, సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ, డీఎన్బీ లేదా డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు 28 నుంచి 30 యేళ్లకు మించకుండా ఉండాలి.
ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో అక్టోబర్ 14, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 5 నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.854లు, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్ధులు రూ.354లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి జీతభత్యాలు ఈ కింది విధంగా చెల్లిస్తారు. ఇతర పూర్తి సమాచారం కోసం అధికారిక నోటిఫికేషన్ చెక్ చేసుకోవచ్చు.
సీనియర్ రెసిడెంట్ పోస్టులకు..
- మొదటి ఏడాది నెలకు రూ.75,000లు
- రెండో ఏడాది రూ.85,000లు
- మూడో ఏడాది రూ.95,000లు
జూనియర్ రెసిడెంట్ పోస్టులకు..
- మొదటి ఏడాది నెలకు రూ.60,000లు
- రెండో ఏడాది రూ.65,000లు
- మూడో ఏడాది రూ.70,000లు
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.