C-DAC Recruitment 2022: బీటెక్/ఎంటెక్ అర్హతతో సీడ్యాక్‌లో 530 ఉద్యోగాలు.. ఏడాదికి రూ.22 లక్షల జీతం..
భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నీలజీ మంత్రిత్వశాఖకు చెందిన పూణెలోని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్.. 530 ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ మేనేజర్, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..
భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నీలజీ మంత్రిత్వశాఖకు చెందిన పూణెలోని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్.. 530 ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ మేనేజర్, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. సైబర్ సెక్యూరిటీ, సైబర్ ఫోరెన్సిక్స్, వీఎల్‌ఎస్‌ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్, గ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్, ఎక్సాస్కేల్ కంప్యూటింగ్ మిషన్, క్వాంటం కంప్యూటింగ్ మిషన్, కంప్యూటింగ్ మిషన్, అప్లైడ్ కంప్యూటింగ్ మిషన్ తదితర విభాగాల్లో ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్/ పీజీ/ ఎంఈ/ ఎంటెక్/ పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు ఖచ్చితంగా 30 నుంచి 56 యేళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్న వారు ఆన్‌లైన్ విధానంలో అక్టోబర్ 20, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అర్హత సాధించిన వారికి పోస్టుల వారీగా జీత భత్యాలు ఈ కింది విధంగా ఉంటాయి.
- ప్రాజెక్ట్ అసోసియేట్ ఏడాదికి రూ.3.6 లక్షల నుంచి రూ.5.04 లక్షల వరకు జీతంగా చెల్లిస్తారు.
- ప్రాజెక్ట్ ఇంజినీర్ ఏడాదికి రూ.12.63 లక్షల నుంచి రూ.22.9 లక్షల వరకు జీతంగా చెల్లిస్తారు.
- సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ ఏడాదికి రూ.8.49 లక్షల నుంచి రూ.14 లక్షల వరకు జీతంగా చెల్లిస్తారు.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు
- ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు: 30
- ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు: 250
- ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టులు: 50
- సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు: 200
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.