Munugode Bypoll: టీఆర్ఎస్ ఆశలపై నీళ్లు చల్లిన ఎన్నికల సంఘం.. ఆసక్తి రేపుతున్న రాజకీయ విశ్లేషణలు..

మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడదల జాతీయ పార్టీగా ఉప ఎన్నికల్లో పోటీ చేద్దామనుకున్న టీఆర్ఎస్ ఆశలపై నీళ్లు చల్లిందా? అంటే అవుననే..

Munugode Bypoll: టీఆర్ఎస్ ఆశలపై నీళ్లు చల్లిన ఎన్నికల సంఘం.. ఆసక్తి రేపుతున్న రాజకీయ విశ్లేషణలు..
TRS
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 03, 2022 | 3:23 PM

మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడదల జాతీయ పార్టీగా ఉప ఎన్నికల్లో పోటీ చేద్దామనుకున్న టీఆర్ఎస్ ఆశలపై నీళ్లు చల్లిందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అలాగే కనిపిస్తున్నాయంటున్నారు. జాతీయ పార్టీగా మునుగోడు ఉపఎన్నిక బరిలో నిలవాలని టీఆర్ఎస్ భావించగా.. తాజాగా ఎన్నికల సంఘం మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్‌ను విడుదల చేసింది. దాంతో టీఆర్ఎస్ ఆశలు అడియాశలైనట్లయ్యింది.

ఎందుకంటే.. సాధారణంగా ఓ రాజకీయ పార్టీ పేరు మారాలంటే కనీసం 30 రోజుల వ్యవధి తప్పనిసరి. అభ్యంతరాలు పరిశీలించి పార్టీ పేరు మార్పుపై తుది నిర్ణయానికి రావాలంటే ఎన్నికల సంఘానికి నెల రోజుల సమయం కావాల్సిందే. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 29 ఏ అదే చెబుతోంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఇపప్పటికిప్పుడు పేరు మార్పునకు దరఖాస్తుకు ఎన్నికల సంఘం ఆమోదిస్తే.. వచ్చే సాధారణ ఎన్నికల నాటికి టీఆర్ఎస్‌కు కొత్త పేరు ఖాయమవుతుంది. కావున.. మొత్తంగా టీఆర్ఎస్ త్వరలో జరగబోయే మునుగోడు ఉప ఎన్నికకు మాత్రం జాతీయ పార్టీ పేరుతో ఎన్నికల బరిలోకి దిగడం దాదాపు అసాధ్యమనే చెప్పవచ్చు.

ఇదిలాఉంటే.. ఎల్లుండి యథావిధిగా జనరల్‌ బాడీ మీటింగ్ నిర్వహించబోతుంది టీఆర్‌ఎస్‌. ఆ రోజు ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌లో సమావేశం కాబోతుంది. ఉపఎన్నిక షెడ్యూల్‌తో సమావేశానికి సంబంధంలేదని అంటున్నారు సీఎం కేసీఆర్. మరి గులాబీ దళపతి మదిలో ఏముందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే