Kishan Reddy: ఎంఐఎం బలోపేతం కోసమే సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
పార్లమెంట్‌లో టీఆర్ఎస్‌కు ఉన్న 8 సీట్లతో సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఎలా చక్రం తిప్పుతారంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఎంఐఎం బలోపేతం కోసమే కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతున్నారంటూ ఆరోపించారు.
పార్లమెంట్‌లో టీఆర్ఎస్‌కు ఉన్న 8 సీట్లతో సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఎలా చక్రం తిప్పుతారంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఎంఐఎం బలోపేతం కోసమే కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతున్నారంటూ ఆరోపించారు. వ్యతిరేక భావనతో వచ్చే ఏ పార్టీకీ మనుగడ ఉండదంటూ కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా పెరుగుతోందన్నారు. ఆ పార్టీకి మిగిలిన ఏకైన మిత్రపక్షం మజ్లిస్ అని.. కేసీఆర్ జాతీయ పార్టీ ఎందుకు పెడుతున్నారో ఆ పార్టీ నేతలకే తెలియదంటూ ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ వైఫల్యాల మీద చర్చ జరగొద్దనేదే కేసీఆర్ ఆలోచన అని తెలిపారు. సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌లో కలలు కంటున్నారంటూ విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబసభ్యులకు నిద్రలోనూ ఈడీ, సీబీఐ, ఐటీ కనిపిస్తున్నాయంటూ కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
మునుగోడు అభివృద్ధి కోసమే ఈ ఉప ఎన్నికలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతోనే ఈ కొద్ది రోజుల్లో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. తెలంగాణలో టీఆర్ఎస్ పాలన పట్ల అన్ని వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ఎవరూ నిలిచినా మునుగోడులో విజయం బీజేపీదేనని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. ఈ ఉప ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలుస్తామన్నారు. ఈ ఎన్నికల ఫలితాలతో టీఆర్ఎస్‌కు భవిష్యత్ ఉండదని.. కల్వకుంట్ల కుటుంబం అంధకారంలోకి పోతోందని తెలిపారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్-టీఆర్ఎస్ కలిసి కుట్ర చేసే అవకాశం ఉందని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కమ్యూనిస్ట్ సానుభూతి పరులంతా కేసీఆర్ కుటుంబ పాలనపై వ్యతిరేకతతో ఉన్నారని.. వాళ్ల మనస్సంతా మోదీపైనే ఉంటుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఎన్నికలు కల్వకుంట్ల కుటుంబ పాలనకు రిఫరెండమ్ అని తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..