Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికపై దూకుడు పెంచిన బీజేపీ.. స్టీరింగ్ కమిటీ సభ్యులు, మండల ఇంచార్జ్‌లు ఈ మీటింగ్..
మునుగోడు బైపోల్‌పై బీజేపీ అగ్రనేత అమిత్ షా ఇప్పటికే స్పెషన్ ఫోకస్ పెట్టారు. మునుగోడు నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్‌తో గెలుపొందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ..
మునుగోడు ఉప ఎన్నికపై ఇటు బీజేపీ స్పీడ్ పెంచింది. బండ్లగూడ జే కన్వెన్షన్ సెంటర్‌లో బీజేపీ ఇంఛార్జ్ సునీల్ బన్సల్ నిన్న సమీక్ష నిర్వహించారు. ఉప ఎన్నిక స్టీరింగ్ కమిటీ సభ్యులు, మండల ఇంచార్జ్‌లు ఈ మీటింగ్‌కు హాజరయ్యారు. మండల సమన్వయ కమిటీలతో సునీల్ బన్సల్ సమావేశం అవుతున్నారు. మునుగోడు బైపోల్‌పై బీజేపీ అగ్రనేత అమిత్ షా ఇప్పటికే స్పెషన్ ఫోకస్ పెట్టారు. మునుగోడు నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్‌తో గెలుపొందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు ముందు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తర్వాత ఆయన బీజేపీలో చేరిపోయారు. మునుగోడు ఉప ఎన్నికలో గెలుపొందడం ద్వారా దీనిని సెమీఫైనల్స్‌గా మార్చి వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు పొందాలని బీజేపీ ఆశిస్తోంది.
ఇలావుంటే, ఇప్పుడు ఉప ఎన్నిక నోటిఫికేషన్‌తో తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి. ఒకవైపు అధికార టీఆర్‌ఎస్, మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మునుగోడుపై అధిపత్యం కోసం శతవిధాల ప్రయత్నాలు సాగిస్తున్నాయి. గెలుపు తమదంటే తమదనే ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. దాంతో మునుగోడు ఉప ఎన్నికపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
మూడు పార్టీలూ తమ అభ్యర్ధులపై కొండంత నమ్మకం పెట్టుకొని బరిలోకి దిగుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ వరుస ఓటములను చవిచూసింది. దీంతో మునుగోడు ఉపఎన్నిక అధికార టీఆర్‌ఎస్ పార్టీకి కీలకం కానుంది. ఇటు కాంగ్రెస్, బీజేపీ కూడా తెలంగాణలో తమ పట్టు సాధించేందుకు తహతహలాడుతున్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్ వ్యతిరేకతపైనే కాంగ్రెస్, బీజేపీ గంపెడాశలు పెట్టుకున్నాయి.
మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల
మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 3న పోలింగ్, 6న కౌంటింగ్ ఉంటుంది. ఈ నెల7న మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసింది. నామినేషన్ల దాఖలుకు చివరితేదీ ఆక్టోబర్ 14 అని నిర్ణయించారు. ఈ నెల 7న ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానున్నది. అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై.. ఈ నెల 14న నామినేషన్ల స్వీకరణకు గడువు ముగియనున్నది. 15న నామినేషన్లను పరిశీలించనుండగా.. 17వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చింది. ఇంతకు ముందు ఎమ్మెల్యేగా గెలుపొందిన కోమటిరెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం