Coffee Side Effects: ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు అస్సలు కాఫీ తాగొద్దు.. పూర్తి వివరాలివే..

చాలా మంది తమ రోజును కాఫీతో మొదలు పెడతారు. ఉదయం నిద్ర లేవగా బెడ్ కాఫీ అంటూ కాఫీ తాగుతారు. అలాగే, కాఫీకి అలవాటు పడిన వారు ఒక్కపూట కాఫీ..

Coffee Side Effects: ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు అస్సలు కాఫీ తాగొద్దు.. పూర్తి వివరాలివే..
Coffee
Follow us

|

Updated on: Oct 02, 2022 | 7:50 PM

చాలా మంది తమ రోజును కాఫీతో మొదలు పెడతారు. ఉదయం నిద్ర లేవగా బెడ్ కాఫీ అంటూ కాఫీ తాగుతారు. అలాగే, కాఫీకి అలవాటు పడిన వారు ఒక్కపూట కాఫీ తాగకపోయినా తలనొప్పి వస్తుంది. నిజానికి కాఫీ ఒత్తిడిని తగ్గించే బూస్టర్‌గా పని చేస్తుంది. ఈ క్రమంలో కాఫీ వల్ల కలిగే ప్రయోజనాలు, ఎఫెక్ట్స్ పై చాలా పరిశోధనలు జరిగాయి. ఈ పరిశోధనలు అనేక విషయాలను వెల్లడించాయి. ముఖ్యంగా కాఫీ తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని పరిశోధకులు తెలిపారు. మరి ఆ సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కాఫీ తాగడం వల్ల పార్కిన్సన్స్ వ్యాధి, పక్షవాతం వంటి తీవ్రమైన వ్యాధుల ముప్పు తగ్గుతుందని చెబుతూనే.. కాఫీ వల్ల అనేక నష్టాలు ఉన్నాయని పరిశోధకులు తెలిపారు. ముఖ్యంగా కొన్ని రకాల సమస్యలతో బాధపడేవారు కాఫీ తాగడం వలన సమస్య మరింత తీవ్రం అవుతుందని హెచ్చరించారు. ఇలాంటి వారు వెంటనే కాఫీ తాగడం మానేయాలని సూచించారు. మరి కాఫీ ఎవరు తాగకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

తరచుగా మూత్రవిసర్జన..

రోజులో తరచుగా అనేకసార్లు మూత్ర విసర్జన చేసేవారు కాఫీ తాగడం మంచిది కాదని సూచించారు నిపుణులు. ఇలాంటి వారు వెంటనే కాఫీ తాగడం మానేయాలని సూచించారు. కాఫీలో కెఫీన్ ఉంటుంది. ఇది మూత్ర విసర్జనను మరింత పెంచుతుంది. ఫలితంగా తరచుగా మూత్రం వస్తుంది.

నిద్రలేమి సమస్య..

నిద్రలేమి సమస్య ఉన్నవారు కాఫీ తాగడం వల్ల సమస్య మరింత ముదిరే ప్రమాదం ఉంది. వీరు వెంటనే కాఫీ తాగడం మానేయాలని సూచిస్తున్నారు. కాఫీ తాగడం వల్ల వ్యక్తి మెదడు యాక్టివేట్ అవుతుంది. నిద్ర పట్టడం కష్టమవుతుంది.

డయేరియా బాధితులు..

డయేరియా బాధితులు కాఫీ తాగడం వల్ల మరిన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది జీర్ణ వ్యవస్థపై దుష్ప్రభావం చూపుతుంది. జీర్ణ వ్యవస్థను దెబ్బతీసి, మరిన్ని సమస్యలకు కారణం అవుతుంది. డయేరియా వంటి సమస్య ఉంటే.. కాఫీ తాగకపోవడమే ఉత్తమం అని సూచిస్తున్నారు నిపుణులు.

గ్లాకోమా బాధితులు..

గ్లాకోమా ఉన్నవారు వెంటనే కాఫీ తాగడం మానేయాలని సూచిస్తున్నారు నిపుణులు. కాదని కాఫీ తాగితే.. కళ్లపై ఒత్తిడి మరింత పెరుగుతుందని అధ్యయనకారులు తెలిపారు. దీనివల్ల కంటిచూపు మరింత లోపిస్తుందని చెబుతున్నారు.

మూర్ఛ వ్యాధి ఉన్నవారు..

మూర్ఛ వ్యాధి ఉన్నవారు కాఫీ తాగడం మానేయాలి. గర్భిణీ స్త్రీలు కాఫీకి దూరంగా ఉండాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..