Drinking Water: నీరు అధిక రక్తపోటును నియంత్రిస్తుందా..? రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలి!

అధిక రక్తపోటు సమస్య ఇప్పుడు ప్రజల జీవనశైలిలో ఒక భాగంగా మారింది. ప్రతి ముగ్గురిలో ఒకరు హై బీపీతో బాధపడుతున్నారు..

Drinking Water: నీరు అధిక రక్తపోటును నియంత్రిస్తుందా..? రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలి!
Drinking Water
Follow us

|

Updated on: Oct 02, 2022 | 9:50 PM

అధిక రక్తపోటు సమస్య ఇప్పుడు ప్రజల జీవనశైలిలో ఒక భాగంగా మారింది. ప్రతి ముగ్గురిలో ఒకరు హై బీపీతో బాధపడుతున్నారు. యువకుల నుంచి వృద్ధుల వరకు అధిక రక్తపోటు సమస్య కనిపిస్తోంది. అధిక రక్తపోటు ఏ వయసులోనైనా వస్తుంది. వృద్ధాప్యంలో హై బీపీ సమస్య ఉంటే అది గుండె జబ్బులకు దారి తీస్తుంది. రక్తపోటును నియంత్రించడానికి తరచుగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అనుసరించమని సలహా ఇస్తారు. అయితే బ్లడ్ ప్రెజర్ ని నీళ్లతో కూడా కంట్రోల్ చేసుకోవచ్చని చెబితే ఇది వింటే మీరు కూడా షాక్ అవుతారు. అధిక రక్తపోటు తగ్గాలంటే నీళ్లు ఎంత అవసరమో తెలుసుకుందాం.

హైడ్రేటెడ్ గా ఉండడం చాలా ముఖ్యం:

మీ ఆరోగ్యాన్ని సరిగ్గా ఉంచుకోవడానికి హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ముఖ్యం అంటున్నారు వైద్య నిపుణులు. డీహైడ్రేషన్, రక్తపోటు మధ్య సంబంధం ఉంది. మనం సరైన మోతాదులో నీరు తాగితే మన శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడం ద్వారా మన గుండె తన పనిని సరిగ్గా చేయగలదు. దీని వల్ల మన రక్త ప్రసరణ కూడా సరిగ్గా జరుగుతుంది. అదే సమయంలో డీహైడ్రేషన్ విషయంలో మన గుండె పంప్ చేయడానికి చాలా కష్టపడాలి.

ఇవి కూడా చదవండి

మీరు రోజూ ఎంత నీరు తాగాలి?

వెరీవెల్ హెల్త్ నివేదిక ప్రకారం.. మహిళలు రోజుకు 2.7 లీటర్ల నీరు తాగాలి. అదే సమయంలో పురుషులు రోజుకు 3.7 లీటర్ల నీరు తాగాలి. కొన్ని పండ్లు, కూరగాయలలో నీటి పరిమాణం కనిపిస్తుంది. దీని కారణంగా మన శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. రక్తపోటు కూడా నియంత్రించబడుతుంది.

సరైన మోతాదులో నీరు తాగడం ముఖ్యం:

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సరైన మొత్తంలో నీరు తాగాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. క్యాల్షియం, మెగ్నీషియం కలిపిన నీటిని తాగడం వల్ల అధిక రక్తపోటు అదుపులో ఉంటుందని ఓ పరిశోధనలో తేలింది. విటమిన్లు, మెగ్నీషియం కోసం మీరు పుదీనా, దోసకాయ, నిమ్మ, జామూన్ కలిపిన నీటిని తాగవచ్చు.

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి