Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cholesterol: శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి సులువైన చిట్కాలు..

కొలెస్ట్రాల్ లైపోప్రొటీన్ల కలయికతో ఉంటుంది. కొలెస్ట్రాల్ రక్త నాళాల్లో పేరుకుపోవడం వల్ల రక్త ప్రసరణను నిరోధిస్తుంది. దీంతో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడానికి..

Cholesterol: శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి సులువైన చిట్కాలు..
Cholesterol
Follow us
Amarnadh Daneti

|

Updated on: Oct 02, 2022 | 10:07 PM

శరీరంలో తగినంత స్థాయిలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఉండటం చాలా ముఖ్యం. హార్మోన్ల ఉత్పత్తికి, సెల్ గోడలను ఫ్లెక్సిబుల్ గా ఉంచడంలో కొలెస్ట్రాల్ దోహదపడుతుంది. ఇదే సమయంలో శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే గుండె జబ్బులు, మూత్రపిండాల సమస్యలు, గుండె పోటు వంటి సమస్యల ప్రమాదం పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. జీవనశైలిలో వస్తున్న మార్పులు, కొన్నిసార్లు జన్యుపరమైన కారణాల వల్ల ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. కొలెస్ట్రాల్ లైపోప్రొటీన్ల కలయికతో ఉంటుంది. కొలెస్ట్రాల్ రక్త నాళాల్లో పేరుకుపోవడం వల్ల రక్త ప్రసరణను నిరోధిస్తుంది. దీంతో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడానికి HDL కొలెస్ట్రాల్ స్థాయిని పెంచడం అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి ఎటువంటి చిట్కాలు పాటించాలో చూద్దాం..

వ్యాయామం తప్పనిసరి: వ్యాయామం శరీర సామర్థ్యాన్ని పెంచుతుంది. వ్యాయమాలు చేయడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తుంది. తేలికపాటి వ్యాయామాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్ ప్రమాదం నుంచి కాపాడతాయి.

కరిగే ఫైబర్ తీసుకోవడం: సోయాబీన్స్, బఠానీలు, కాయధాన్యాలు, పండ్లు, ఇతర తృణధాన్యాలు కరిగే ఫైబర్‌కు మూలాలు. వాటిని తీసుకోవడం వల్ల శరీరం నుండి ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో సహాయపడే బ్యాక్టీరియా ప్రోబయోటిక్‌కు సహాయసడుతుంది.

ఇవి కూడా చదవండి

మోనోశాచురేటెడ్ ఫ్యాట్స్: ఆలివ్ ఆయిల్, కనోలా ఆయిల్, ట్రీ నట్స్, అవకాడోస్ వంటి మోనోఅన్‌ శాచురేటెడ్ కొవ్వులను తీసుకోవడం వల్ల ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది, అదే సమయంలో హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది, ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడానికి దోహదపడుతుంది.

ఆరోగ్యకరమైన బరువు: బరువు తగ్గడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. బరువు తగ్గడం వల్ల ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ అయిన హెచ్‌డిఎల్ పెరుగుతుంది.

ట్రాన్స్‌ ఫ్యాట్స్ నిర్వహణ: ట్రాన్స్ ఫ్యాట్ శరీరంలో ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది, అదే సమయంలో హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది, ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలకు పెంచే అవకాశం కూడా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ప్రమాదకరం. పై చిట్కాల ద్వారా శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి బ్యాలెన్స్ చేసుకోవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..