Memory Problem In Children: మీ పిల్లల్లో జ్ఞాపకశక్తి మందగిస్తుందా..? ఈ ఆహారాలతో అద్భుతమైన ప్రయోజనం
ప్రతి వ్యక్తికి జ్ఞాపకశక్తి అనేది ఎంతో అవసరం. కొందరిలో జ్ఞాపకశక్తి తక్కువగా ఉంటుంది. కొందరికేమో ఎక్కువగా ఉంటుంది. సాధారణ వయసు పెరిగినకొద్ది జ్ఞాపక శక్తి తగ్గిపోతుంటుంది..
ప్రతి వ్యక్తికి జ్ఞాపకశక్తి అనేది ఎంతో అవసరం. కొందరిలో జ్ఞాపకశక్తి తక్కువగా ఉంటుంది. కొందరికేమో ఎక్కువగా ఉంటుంది. సాధారణ వయసు పెరిగినకొద్ది జ్ఞాపక శక్తి తగ్గిపోతుంటుంది. వయసుతో పాటు మెదడు పని తీరు సైతం మందగిస్తుంది. చిన్న చిన్న విషయాలను సైతం మర్చిపోతుంటారు. ఈ సమస్య సాధారణంగా వృద్ధుల్లో తలెత్తుతుంటుంది. కానీ ఇప్పుడున్న కాలంలో పెద్దలతో పాటు పిల్లలకు సైతం వస్తుంది. ఇక చిన్న పిల్లల్లో కూడా ఈ సమస్య ఉంటుంది. వారి జ్ఞాపక శక్తి సైతం మందగిస్తుంటుంది. ఇప్పుడే చెప్పిందే సరిగ్గా గుర్తుండదు వారికి. ఏ విషయంపైనా సరిగా ఏకాగ్రత నిలపలేరు. సాధారణంగా ఈ సమస్యలన్నీ వృద్ధులలో కనిపిస్తాయి. అయితే మారుతోన్న జీవనశైలి కారణంగా యువత, పిల్లల్లో కూడా మతిమరుపు సమస్య వస్తోంది. ముఖ్యంగా చదువుకునే విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత బాగా తగ్గిపోతోంది. ఈక్రమంలో వారు వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. అదేవిధంగా కొన్ని ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. పోషకవిలువలు సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. మరి జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం రండి.
- ఆకుకూరలు: ఆకు కూరల్లో విటమిన్లతో పాటు పలు రకాల పోషకాలు ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్తిని పెంచడంలో బాగా తోడ్పడుతాయి. ముఖ్యంగా మతిమరుపు సమస్య ఉన్నవారు పచ్చని ఆకుకూరలు, కాయగూరలను ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
- వాల్ నట్స్: వాల్‌నట్స్ లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు విరివిగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. అదేవిధంగా ఇందులో ఉండే ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తుంది.
- చేపలు: ఆయిల్ ఫిష్ లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు కణాల నిర్మాణానికి చాలా అవసరం. సాల్మన్, మాకేరెల్, సార్డినెస్, హెర్రింగ్ వంటి చేపలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని కనీసం వారానికి ఒకసారైనా తీసుకుంటే మతిమరుపు సమస్యను అధిగమించవచ్చు.
- నల్లరేగు పండ్లు: వీటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం ద్వారా పెరుగుతున్న వయస్సుతో జ్ఞాపకశక్తి కోల్పోకుండా నిరోధించవచ్చు. ఇందులో ఉండే విటమిన్ ఇ మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తుంది. రోజుకు 8 నుంచి 10 బెర్రీలు ఆహారంలో చేర్చుకుంటే మంచి ఫలితముంటుందని నిపుణులు చెబుతున్నారు.
- పాలు, పెరుగు..: పాలు, పెరుగు, జున్ను..తదితర డెయిరీ ఉత్పత్తుల్లో ప్రోటీన్లతో పాటు B విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి మెదడు కణజాలం, న్యూరోట్రాన్స్ మీటర్లు, ఎంజైమ్‌ల అభివృద్ధికి సహకరిస్తాయి. పాలల్లో అధికంగా ఉండే క్యాల్షియం దంతాలు, ఎముకలను బలంగా మారుస్తుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి