AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sleeping: మీరు ప్రతి రోజు 6 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా..? అయితే సమస్యల్లో చిక్కుకున్నట్లే..!

ప్రస్తుతం రోజుల్లో రకరకాల వ్యాధులు వ్యాపిస్తున్నాయి. కొత్త కొత్త వైరస్‌లతో సతమతమవుతుంటే సరైన ఆహారం లేని కారణంగా కూడా మనిషి అనారోగ్యం బారిన పడుతున్నాడు...

Sleeping: మీరు ప్రతి రోజు 6 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా..? అయితే సమస్యల్లో చిక్కుకున్నట్లే..!
Sleeping
Subhash Goud
|

Updated on: Oct 02, 2022 | 3:18 PM

Share

ప్రస్తుతం రోజుల్లో రకరకాల వ్యాధులు వ్యాపిస్తున్నాయి. కొత్త కొత్త వైరస్‌లతో సతమతమవుతుంటే సరైన ఆహారం లేని కారణంగా కూడా మనిషి అనారోగ్యం బారిన పడుతున్నాడు. ఇక ప్రతి ఒక్కరికి నిద్ర అనేది ఎంత ముఖ్యమో అందరికి తెలిసిందే. మన శరీరానికి తగినంత నిద్ర చాలా ముఖ్యం. ఎంత బిజీగా ఉన్నా కనీసం రోజుకు 6 నుంచి 8 గంటల వరకు నిద్రపోవాలని వైద్య నిపుణులు సూచిస్తారు. అయితే ప్రస్తుతమున్న యాంత్రిక జీవనం, ఉద్యోగాలు, ఇతర పనుల వల్ల చాలామంది నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఏ అర్ధరాత్రో నిద్రకు ఉపక్రమిస్తున్నారు. అందులోనూ కనీసం 6 గంటలు కూడా నిద్రపోనివారు మనలో చాలామంది ఉన్నారు. అయితే ఈ నిద్రలేమి వల్ల పలు మానసిక సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుందని, ఫలితంగా తరచుగా జలుబు, ఇతర శారీరక సమస్యలతో బాధపడతారట. ఇక తక్కువగా నిద్రపోవడం వల్ల మెదడు పనితీరుపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఉంటుందట.

6 గంటలు లేదా అంతకంటే తక్కువ సమయం నిద్రపోతే మానసిక స్థితి క్రమంగా క్షీణించడం ప్రారంభమవుతుంది. చిన్న చిన్న విషయాలకు కూడా తీవ్ర ఒత్తిడికి గురవుతారు. కొన్నిసార్లు ఈ ఒత్తిడి బాగా పెరిగిపోయి డిప్రెషన్‌లోకి వెళ్లే ప్రమాదం ఉంది. నిద్ర లేమికి, డిప్రెషన్ కు చాలా సంబంధం ఉంది. డిప్రెషన్ ఉంటే నిద్ర రాదు, నిద్ర పట్టకపోతే డిప్రెషన్ వస్తుంది. కాబట్టి రోజులో కనీసం 6 గంటలైనా ప్రశాంతంగా నిద్రపోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

జ్ఞాపకశక్తి పై తీవ్ర ప్రభావం

ఇవి కూడా చదవండి

6-7 గంటలు లేదా అంతకంటే తక్కువ సమయం నిద్రపోయే అలవాటు ఉన్న వ్యక్తుల్లో జ్ఞాపకశక్తి క్షీణిస్తుంది. ఎక్కువగా ఆందోళన పడుతుంటారు. చాలా విషయాలను మర్చిపోతుంటారు. అందుకే నిద్రలేమి సమస్యలున్న వారు వెంటనే వైద్యులను సంప్రదించాలి. కావాలంటే ఇంట్లోనే యోగా చేయడం ద్వారా ఈ సమస్య నుంచి మిమ్మల్ని మీరు దూరంగా ఉంచుకోవచ్చు.

ఏకాగ్రతపై ఎఫెక్ట్

నిద్రలేమి మెదడు పనితీరుపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతంది. ఏకాగ్రత సామర్థ్యం దెబ్బతింటుంది. ఏ పనిపైనా శ్రద్ధ పెట్టలేరు. ఫలితంగా వృత్తిపరంగా, వ్యక్తిగతంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి ఎంత బిజీగా ఉన్నా రోజుకు కనీసం 6 గంటలైనా నిద్రపోవాలి. ఇందుకోసం ఆరోగ్యకరమైన జీవనశైలిని ఎంచుకోవాలి. పోషకాలతో కూడిన ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. కాఫీ, టీ, కూల్‌ డ్రింక్స్‌లకు దూరంగా ఉండాలి. పడుకునే ముందు ఫోన్లను దూరంగా పెట్టాలి.

ఇలా నిద్రలేమి కారణాల రకరకాల వ్యాధులు వెంటాడుతుంటాయి. నిద్రతో ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అందుకే వైద్యులు కూడా పదేపదే నిద్ర అవసరం అని చెబుతుంటాయి. చాలా మంది రాత్రుల్లో నిద్రపోకుండా స్మార్ట్‌ఫోన్‌లలో బీజీగా ఉంటారు. చాటింగ్స్‌, వీడియోలు చూడటం లాంటివి చేస్తుంటారు. దీని వల్ల నిద్రలేకపోవడమే కాకుండా రాత్రి సమయంలో స్క్రీన్‌పై ఎక్కువ సేపు గడపడం మరిన్ని వ్యాధులను తెచ్చుకున్నవారవుతారు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం..

ఆగని బంగారం–వెండి ధరలు! ఇప్పుడు కొంటే లాభమా? లేక ప్రమాదమా?
ఆగని బంగారం–వెండి ధరలు! ఇప్పుడు కొంటే లాభమా? లేక ప్రమాదమా?
నేను ఇంకా ఆ పార్టీలోనే ఉన్నా.. ఎమ్మెల్యే దానం ఊహించని ట్విస్ట్..
నేను ఇంకా ఆ పార్టీలోనే ఉన్నా.. ఎమ్మెల్యే దానం ఊహించని ట్విస్ట్..
సమ్మక్క-సారక్క కంటే ముందే తప్పనిసరి దర్శనం.. గట్టమ్మ తల్లి ఎవరు?
సమ్మక్క-సారక్క కంటే ముందే తప్పనిసరి దర్శనం.. గట్టమ్మ తల్లి ఎవరు?
మేడారం జాతరలో మొక్కు సమర్పించుకున్న జబర్దస్త్ రచ్చ రవి.. ఫొటోస్
మేడారం జాతరలో మొక్కు సమర్పించుకున్న జబర్దస్త్ రచ్చ రవి.. ఫొటోస్
బైక్స్ బయటపెట్టి హాయిగా పడుకుంటున్నారా?.. ఇది చూస్తే..
బైక్స్ బయటపెట్టి హాయిగా పడుకుంటున్నారా?.. ఇది చూస్తే..
నైట్ వాచ్‌మ్యాన్‌ అనుకుంటే డబుల్ సెంచరీ బాదేశాడు..
నైట్ వాచ్‌మ్యాన్‌ అనుకుంటే డబుల్ సెంచరీ బాదేశాడు..
అంత పొగరొద్దు.. ఇకపై ఎంపిక చేయబోమంటూ షాకిచ్చిన సెలెక్టర్లు
అంత పొగరొద్దు.. ఇకపై ఎంపిక చేయబోమంటూ షాకిచ్చిన సెలెక్టర్లు
వాట్సప్‌లో ఇలాంటి ఫీచర్ మీరు ఎక్కడా చూసి ఉండరు.. ఒక ట్యాప్‌తో..
వాట్సప్‌లో ఇలాంటి ఫీచర్ మీరు ఎక్కడా చూసి ఉండరు.. ఒక ట్యాప్‌తో..
హైదరాబాదీలకు అలర్ట్.. ఈ ఏరియాల్లో మంచినీళ్లు తాగే ముందు జాగ్రత్త
హైదరాబాదీలకు అలర్ట్.. ఈ ఏరియాల్లో మంచినీళ్లు తాగే ముందు జాగ్రత్త
పెళ్లి త్వరగా కావాలంటే ఈ ఆలయానికి వెళ్లాల్సిందే..!
పెళ్లి త్వరగా కావాలంటే ఈ ఆలయానికి వెళ్లాల్సిందే..!