Prachand: భారత వాయుసేనలోకి ‘ప్రచండ్’ రంగప్రవేశం.. దీని ప్రత్యేకతలు ఏంటో తెలుసా..

భారత వాయుసేన అమ్ములపొదిలో తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ 'ప్రచండ్' రంగప్రవేశం చేసింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ అత్యాధునిక తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ ను రాజస్థాన్ లోని జోధ్ పుర్ లో జరిగిన కార్యక్రమంలో..

Prachand: భారత వాయుసేనలోకి 'ప్రచండ్' రంగప్రవేశం.. దీని ప్రత్యేకతలు ఏంటో తెలుసా..
Prachand Helicopter
Follow us
Amarnadh Daneti

|

Updated on: Oct 03, 2022 | 6:38 PM

భారత వాయుసేన అమ్ములపొదిలో తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ ‘ప్రచండ్’ రంగప్రవేశం చేసింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ అత్యాధునిక తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ ను రాజస్థాన్ లోని జోధ్ పుర్ లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ వీటిని లాంఛనంగా భారత వైమానిక దళంలోకి ప్రవేశపెట్టారు. పర్వత ప్రాంతాల్లో మోహరించేందుకు రూపొందించిన ప్రచండ్ హెలికాప్టర్లను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అభివృద్ధి చేసింది. దేశ సైనిక సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు స్వదేశీ పరిజ్ఞానంతో తేలికపాటి హెలికాప్టర్లను సమకూర్చేందుకు 2020 మార్చిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన భద్రతా కేబినేట్ కమిటీ ఆమోదం తెలిపింది. మొదట 15 హెలికాప్టర్ల కోసం రూ.3887 కోట్లను కేంద్రప్రభుత్వం కేటాయించింది. వీటిలో 10 హెలికాప్టర్లను భారత వాయుసేనకు, మరో ఐదు హెలికాప్టర్లను ఆర్మీకి కేటాయించారు. రాజస్థాన్ లోని జోధ్ పుర్ లో అక్టోబర్ 3వ తేదీన జరిగిన కార్యక్రమంలో 4 హెలికాప్టర్లను భారత వాయుసేనలోకి ప్రవేశపెట్టారు. భవిష్యత్తులో మరిన్ని ప్రచండ్ లైట్ వెయిట్ యుద్ధ హెలికాప్టర్లు భారత వాయుసేనలో చేరనున్నాయి.

1999 కార్గిల్ యుద్ధం తర్వాత తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ల అవసరాన్ని గుర్తించి స్వదేశీ పరిజ్ఞానంతో వీటిని అభివృద్ధి చేశారు. ప్రచండ్ లైట్ వెయిట్ యుద్ధ హెలికాప్టర్లు ధ్రువ్ హెలికాప్టర్ల మాదిరిగానే ఉంటాయి. రెండు ఇంజిన్లు కలిగిన ఈ తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ బరువు కేవలం 5.8 టన్నులు. గాల్లో క్షిపణి లక్ష్యాలను టార్గెట్ చేసే విధంగా ఎయిర్ టు ఎయిర్ గన్స్ ఈ హెలికాప్టర్ కు ఉంటాయి. 20 ఎంఎం టర్రెంట్ గన్స్, రాకెట్ వ్యవస్థతో పాటు ఇతర ఆయుధాలను విడిచే ఏర్పాట్లు ఈ యుద్ధ హెలికాప్టర్ లో ఉన్నాయి. యుద్ధ ట్యాంకులు, బంకర్లు, డ్రోన్లు సహా ఎత్తైన పర్వత ప్రాంతాలతో పాటు రాత్రివేళ్లలోనూ శత్రు లక్ష్యాలను చేధించే సామర్థ్యం ఈ హెలికాప్టర్లకు ఉన్నాయి.

ప్రచండ్ తేలికపాటి యుద్ధ హెలికాఫ్టర్లను వాయుసేనలో ప్రవేశపెట్టిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. దేశ రక్షణ ఉత్పత్తిలో భారతదేశ సామర్థ్యాన్ని ప్రతిబింబించే ముఖ్యమైన సందర్భం ఇదని అన్నారు. రానున్న రోజుల్లో స్వదేశీ పరిజ్ఞానంతో మరిన్ని రక్షణ రంగానికి సంబంధిచిన ఉత్పత్తులు తయారుచేయనున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..

Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం