AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cholesterol: ముఖం, చర్మంపై ఇలాంటి సంకేతాలు కనిపిస్తున్నాయా..? అయితే, అస్సలు నిర్లక్ష్యం చేయకండి..

ప్రస్తుత కాలంలో చాలామందిలో అధిక కొలెస్ట్రాల్ సమస్య అనేది సర్వసాధారణంగా మారింది. అదే సమయంలో శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుదల చాలా తీవ్రమైనదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Cholesterol: ముఖం, చర్మంపై ఇలాంటి సంకేతాలు కనిపిస్తున్నాయా..? అయితే, అస్సలు నిర్లక్ష్యం చేయకండి..
High Cholesterol Symptoms
Shaik Madar Saheb
|

Updated on: Oct 03, 2022 | 8:29 PM

Share

ప్రస్తుత కాలంలో చాలామందిలో అధిక కొలెస్ట్రాల్ సమస్య అనేది సర్వసాధారణంగా మారింది. అదే సమయంలో శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుదల చాలా తీవ్రమైనదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని కారణంగా అనేక సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుందని చెబుతున్నారు. అంతేకాదు.. కొలెస్ట్రాల్ స్థాయి నియంత్రణలో లేకుంటే గుండెకు సంబంధించిన అనేక వ్యాధులు మిమ్మల్ని చుట్టుముడతాయి. అటువంటి పరిస్థితిలో మీరు కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. కొలెస్ట్రాల్ స్థాయి పెరిగినప్పుడు చర్మం కొన్ని సూచనలను ఇస్తుంది. అలాంటి వాటిని మరచిపోయి కూడా విస్మరించకూడదని సూచిస్తున్నారు. కొలెస్ట్రాల్ పెరిగితే.. చర్మంపై ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..

కొలెస్ట్రాల్ స్థాయి పెరిగినప్పుడు చర్మం ఈ సంకేతాలను ఇస్తుంది..

చెమట కాయల (ప్రిక్లీ హీట్) సమస్య: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరగడం వల్ల ముఖంపై ప్రిక్లీ హీట్ సమస్య ఏర్పడుతుంది. కానీ కొందరు మాత్రం సింపుల్‌గా పట్టించుకోకుండా ఉంటారు. అలా చేయడం హానికరంగా మారుతుంది. ముఖం మీద ప్రిక్లీ హీట్ అనేక కారణాల వల్ల కావచ్చు. అయితే దీనికి ప్రధాన కారణం అధిక కొలెస్ట్రాల్.

ఇవి కూడా చదవండి

చర్మం రంగులో మార్పు: అధిక కొలెస్ట్రాల్ సమస్యలో చర్మం రంగు మారడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా మీ చర్మం రంగు ముదురు రంగులోకి మారుతుంది. కళ్ల చుట్టూ కూడా చిన్న చిన్న వేడి పొక్కులు కనిపించడం ప్రారంభమవుతుంది. ఇలా ఉంటే మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

ముఖం మీద దురద: ముఖం మీద విపరీతమైన దురద కూడా అధిక కొలెస్ట్రాల్ లక్షణంగా పరిగణిస్తారు. చాలా కాలంగా ముఖంపై దురద, ఎర్రగా మారడం వంటి సమస్య ఉంటే నిర్లక్ష్యం చేయకండి.

ముఖంపై మొటిమలు, ఎర్రని మచ్చలు: అధిక కొలెస్ట్రాల్ కారణంగా మీ ముఖం మీద కళ్ళు, ముక్కు చుట్టూ చిన్న ఎర్రటి మచ్చలు వస్తాయి. అంతేకాకుండా మొటిమలు కూడా తీవ్రమవుతాయి. కావున ఇలాంటి వాటిని విస్మరించడం వల్ల చాలా ప్రమాదం ఏర్పడుతుందని పేర్కొంటున్నారు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం..