Dussehra: దేశవ్యాప్తంగా దసరా సందడి.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దంటున్న నిపుణులు..
దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. విజయదశమి పర్వదిన వేడుకలో భాగంగా శరన్నవరాత్రులు వైభవంగా కొనసాగుతున్నాయి. అన్ని ప్రాంతాల్లో భక్తులు దుర్గాదేవిని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తున్నారు.

దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. విజయదశమి పర్వదిన వేడుకలో భాగంగా శరన్నవరాత్రులు వైభవంగా కొనసాగుతున్నాయి. అన్ని ప్రాంతాల్లో భక్తులు దుర్గాదేవిని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తున్నారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో దసరా సంబురాలు అంబరాన్నంటేలా జరుగుతాయి. బుధవారం జరిగే విజయదశమి వేడుకలను అట్టహాసంగా జరుపుకునేందుకు ప్రజలంతా సిద్ధమవుతున్నారు. అయితే.. వేడుకల్లో భాగంగా ఎక్కువ మంది ఒకేచోట గుమిగూడటం, పలు కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. కావున వైరస్ ముప్పుపై అలర్ట్‌గా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ వేడుకలతో పాటు వ్యాధులు ప్రబలే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. కోవిడ్-19 వ్యాప్తి నియంత్రణలో ఉన్నప్పటికీ, మరో వేవ్ రాకుండా జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు.
ఈ సమయంలో ఉత్తర భారతదేశంలో ఉదయం, రాత్రి వేళ చలి కూడా ప్రారంభమైంది. కొన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం వేడిగా ఉంది. అయితే, ఉష్ణోగ్రత, సీజన్‌లో మార్పులతో జలుబు, ఫ్లూ, ఇతర కాలానుగుణ ఆరోగ్య సమస్యలతో బాధపడే వారి సంఖ్య పెరుగుతుందని పేర్కొంటున్నారు. వైద్య పరిశోధన ప్రకారం.. ప్రతి సంవత్సరం చాలా మంది పెద్దలు 2-4 సార్లు, పిల్లలు 5-7 సార్లు జలుబుతో బాధపడుతున్నారు. ఇది దాదాపుగా ఒకే సంవత్సరంలో సీజన్ ఎన్నిసార్లు మారుతుందో అన్ని సార్లు ఈ ప్రమాదం పెరుగుతూనే ఉంటుంది. అయితే.. సీజన్‌లో మార్పును గమనించిన ప్రతిసారీ, వాతావరణంలో అలెర్జీ కారకాల సంఖ్య గాలిలో దాదాపు 200 వైరస్‌ల వరకు పెరుగుతుందని అధ్యయనంలో గుర్తించినట్లు వైద్య నిపుణులు తెలిపారు.
అందుకే పండుగ సీజన్లో కొన్ని చర్యలు తీసుకోవడం ద్వారా ఈ ముప్పును అధిగమించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం వానాకాలం చివరి దశ.. శీతకాలం ప్రారంభ దశలో ఉన్న తరుణంలో ప్రమాదం మరింత పెరిగే అవకాశముందని పేర్కొంటున్నారు.




ఈ పండుగ సీజన్‌లో మీరు పాటించాల్సిన కొన్ని మార్గదర్శకాలు..
మాస్క్‌లు ధరించండి: COVID-19 కేసులు స్వల్పంగా ఉన్నప్పటికీ ముందు జాగ్రత్త అవసరం. మీరు రద్దీగా ఉండే ప్రదేశానికి వెళుతున్నట్లయితే వివిధ వైరస్‌ల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మాస్క్‌లు ధరించండి. మీరు బంధువుల ఇంటికి వెళ్లినా.. ఎవరైనా మీ ఇంటికి వచ్చినా మాస్క్ ధరించడం మంచిది. ఈ సందర్శనల సమయంలో మీరు అనేక మంది వ్యక్తులను కలుస్తూ ఉండవచ్చు. కాబట్టి, మాస్క్‌లు ఒక విధమైన రక్షణ కవచంలా పని చేస్తాయి.
భౌతిక దూరాన్ని పాటించండి: మీకు దగ్గు, తుమ్ములు మొదలైన లక్షణాలు ఉంటే భౌతిక దూరం పాటించడం మంచిది. ఒకవేళ మీ ఫ్లూ ప్రమాదం బాగా పెరిగినా.. లేదా COVID-19 పాజిటివ్ గా నిర్ధారణ అయినా.. ఆహ్వానాలను తిరస్కరించండి.. ఐసోలేషన్ లో ఉండండి. మీ దగ్గరకు ఎవరూ రాకుండా చూసుకోండి. మిమ్మల్ని సందర్శించే వ్యక్తులకు కూడా ఇది వర్తిస్తుంది. ఆరోగ్యమే మొదటిదని గుర్తుంచుకోండి.
ఎల్లవేళలా చేతుల పరిశుభ్రత ముఖ్యం: పండుగలు అంటే అందరూ సంతోషంతో ఒకరినొకరూ కౌగిలించుకొని ఆప్యాయంగా పలకరించుకుంటారు. అదే సమయంలో స్వీట్లు పంచుకుంటారు. ఒకరినొకరు తినిపించుకుంటారు. ఇలాంటి సమయంలో కూడా వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. అందుకే క్రమం తప్పకుండా చేతుల పరిశుభ్రతను పాటించాలని నిర్ధారించుకోండి. వీలైనప్పుడల్లా శానిటైజ్ చేసుకోండి.
ఈ లక్షణాలను విస్మరించవద్దు: మీరు ఏదైనా ప్రయాణ చరిత్రను కలిగి ఉంటే.. ఫ్లూ-వంటి లక్షణాలు కనిపిస్తే మంకీపాక్స్, కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సలహా ఇస్తారు. సందేహాస్పదంగా ఉన్నప్పుడు, ఇలాంటి పరిస్థితిలో బాధపడుతున్నప్పుడు కుటుంబంతో పండుగ జరుపుకోవడానికి దూరంగా ఉండండి.
ఫ్లూ మాత్రలను నిల్వ చేసుకోండి: మీరు కొంత కాలంగా ముక్కు కారటం లేదా మైగ్రేన్ తలనొప్పి లాంటివి ఉంటే విస్మరించకండి.. ఇంకా పలు ఆహార పదార్థాలను సాధారణంగా తీసుకోకండి. సమయానికి మందులు తీసుకోండి. మీ రెగ్యులర్ మాత్రలను (ముఖ్యంగా రక్తపోటు, మధుమేహం) కూడా వేసుకుంటూ ఉండండి.
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం..