Indian Currency History: భారత కరెన్సీ హిస్టరీ మీకు తెలుసా? గాంధీ ఫోటోకి ముందు నోట్లపై ఏ చిహ్నాలు ఉండేవో తెలుసా?

భారతదేశంలో రాజుల పాలన నుంచి స్వాతంత్యం అనంతరం వరకు కాలానుగుణంగా కరన్సీలో అనేక మార్పులు వచ్చాయి. వస్తు మార్పిడి విధానం మొదలు..

Indian Currency History: భారత కరెన్సీ హిస్టరీ మీకు తెలుసా? గాంధీ ఫోటోకి ముందు నోట్లపై ఏ చిహ్నాలు ఉండేవో తెలుసా?
Indian Currency History
Follow us

|

Updated on: Oct 27, 2022 | 8:26 AM

భారతదేశంలో రాజుల పాలన నుంచి స్వాతంత్యం అనంతరం వరకు కాలానుగుణంగా కరన్సీలో అనేక మార్పులు వచ్చాయి. వస్తు మార్పిడి విధానం మొదలు.. కరెన్సీ వినియోగం వరకు దశల వారీగా మార్పులు చోటు చేసుకున్నాయి. నాటి బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం 1930లో చేసిన చట్టం ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ను ఏర్పాటు చేసింది. నాటి నుంచి నేటి వరకు ఆర్‌బిఐ విడుదల చేసే కరెన్సీ నోట్లే దేశంలో ద్రవ్య రూపంలో చెలామణి అవుతుంది. అయితే, రాజుల కాణంలో నాణెలపై రాజుల ముఖ చిత్రాలు, ఇతర గుర్తులు ముద్రించినట్లే.. నేటి కరెన్సీపైనా ప్రముఖుల చిత్రాలు, ప్రముఖ ప్లేస్‌ల చిత్రాలను ముద్రించడం జరుగుతుంది.

అయితే, తాజాగా భారత కరెన్సీ మార్పునకు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన డిమాండ్.. ఇప్పుడు కరెన్సీపై చర్చకు దారి తీసింది. కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మతో పాటు గణేషుడు, లక్ష్మీ దేవిల చిత్రాలను కూడా ముద్రించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కేజ్రీవాల్. దేవుళ్లు, దేవతల ఆశీస్సులు ఉంటేనే భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుందని కేజ్రీవాల్ అన్నారు. అయితే, ఇలాంటి డిమాండ్ మొదటిసారి వచ్చిందేం కాదు. మరి కేజ్రీవాల్‌ డిమాండ్‌పై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

ఇంతకు ముందు కూడా చాలా డిమాండ్స్..

గతంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలోని జాతీయ సలహా మండలి సభ్యుడిగా ఉన్న నరేంద్ర జాదవ్ కూడా భారత కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీతో పాటు రాజ్యాంగ నిర్మాతలు బీఆర్ అంబేద్కర్, స్వామి వివేకానంద చిత్రాలను ముద్రించాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో, నేతాజీ సుభాష్ చంద్రబోస్ బంధువులు కూడా కొత్త నోట్లపై నేతాజీ చిత్రాన్ని ముద్రించాలని చాలాసార్లు డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఇక బీజేపీ కూడా ఓ డిమాండ్ చేసింది. కొత్త వెయ్యి రూపాయల నోటుపై మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి చిత్రాన్ని ఉంచాలని మహారాష్ట్ర బీజేపీ నేత అర్జున్ గుప్తా డిమాండ్ చేశారు. కొన్ని కొత్త నోట్లపై రవీంద్రనాథ్ ఠాగూర్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చిత్రాలను ముద్రిస్తారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే, ఆ వార్తలన్నింటినీ ఆర్‌బీఐ కొట్టిపారేసింది.

స్వాతంత్ర్యానికి ముందు భారత రూపాయి..

స్వాతంత్ర్యానికి ముందు కూడా ఆర్‌బీఐ భారత కరెన్సీని ముద్రించేది. 1938లో తొలిసారిగా బ్రిటన్ రాజు 6వ జార్జ్ ఫోటోతో కూడిన 5 రూపాయల నోటును ఆర్‌బిఐ విడుదల చేసింది. ఆ తర్వాత 10 రూపాయల నోట్లు, 100 రూపాయల నుండి 1,000 రూపాయల వరకు విడుదల చేసింది. ఆ తరువాత 10,000 రూపాయల వరకు నోట్లను విడుదల చేశారు. బ్రిటిష్ కాలంలో విడుదలైన ఈ నోట్లన్నీ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కొంత కాలం వరకు చలామణిలో ఉన్నాయి.

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత డిజైన్‌లో మార్పులు..

బ్రిటీష్ వారి నుండి స్వాతంత్ర్యం పొందిన తరువాత భారత రూపాయి పునఃరూపకల్పన చేయబడింది. 1949లో కరెన్సీలో ఫోటోను మార్చడం ద్వారా ఆర్‌బీఐ పెను మార్పునకు శ్రీకారం చుట్టింది. భారత కరెన్సీపై బ్రిటీష్ రాజు జార్జ్ VI ఫోటోను RBI తొలగించి. ఆ స్థానంలో జాతీయ చిహ్నమైన అశోక స్తంభాన్ని ముద్రించారు.

స్వాతంత్ర్యానంతరం 1950లో భారత రూపాయి 2, 5, 10, 100 రూపాయల నోట్ల రంగు, డిజైన్‌లో స్వల్ప మార్పులు చేయడం జరిగింది. ఇక 1954లో, తంజావూరు ఫోటోతో 1,000 రూపాయల నోటు, గేట్‌వే ఆఫ్ ఇండియా ఫోటోతో రూ. 5,000 వేలు నోటు, అశోక స్తంభం ఫోటోతో రూ. 10,000 నోటు విడుదలైంది. 1978లో ప్రభుత్వ పెద్ద నోట్లను రద్దు చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
శరీరంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
శరీరంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి
బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి
పవన్‌కు ఎన్ని కోట్ల అప్పులున్నాయో తెలుసా? మొత్తం ఆస్తుల వివరాలివే
పవన్‌కు ఎన్ని కోట్ల అప్పులున్నాయో తెలుసా? మొత్తం ఆస్తుల వివరాలివే