AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhagini Hastha Bhojanam: నేడు భగినీ హస్త భోజనం.. ఈ అన్నాచెలెళ్ల పండగ విశిష్టత, శుభ ముహర్తం గురించి తెలుసుకోండి

సోదరీ సోదర ప్రేమకి అద్దం పట్టే పండుగల్లో రాఖీ పండుగ తర్వాత చెప్పుకోదగినది ఇది సోదరీ, సోదరుల ఆప్యాయత, అనుబంధాలకు అద్దంపట్టే ఒక సంప్రదాయం భగినీ హస్త భోజనం. భగిని అంటే సోదరి.  సోదరి  పెట్టే భోజనం కనుక "భగినీ హస్త భోజనం" అంటారు.

Bhagini Hastha Bhojanam: నేడు భగినీ హస్త భోజనం.. ఈ అన్నాచెలెళ్ల పండగ విశిష్టత, శుభ ముహర్తం గురించి తెలుసుకోండి
Bhagini Hastha Bhojanam 2022
Surya Kala
|

Updated on: Oct 27, 2022 | 7:34 AM

Share

కార్తీక మాసంలో శుక్లపక్షం విదియ నాడు వచ్చే రోజుని భగినీ హస్త భోజనం లేదా అన్నా చెల్లెలు పండుగ అంటారు. సోదరీ,సోదర ప్రేమకి అద్దం పట్టే పండుగ. ఈ ఏడాది అన్నా చెల్లెల పండగను నేడు జరుపుకోనున్నారు. సోదరీ సోదర ప్రేమకి అద్దం పట్టే పండుగల్లో రాఖీ పండుగ తర్వాత చెప్పుకోదగినది ఇది సోదరీ, సోదరుల ఆప్యాయత, అనుబంధాలకు అద్దంపట్టే ఒక సంప్రదాయం భగినీ హస్త భోజనం. భగిని అంటే సోదరి.  సోదరి  పెట్టే భోజనం కనుక “భగినీ హస్త భోజనం” అంటారు. కార్తీక శుద్ధ విదియ అంటే దీపావళి పండగ  రెండవ నాడు ఈ వేడుకను జరుపుకుంటారు. ఈరోజు అన్నదమ్ములు తమ తమ అక్కా చెల్లెళ్ళ ఇంటికి వెళ్లి.. వారి చేతితో నుదుట తిలకం దిద్దించుకుని.. వారి వంట తిని.. బహుమతిని ఇస్తారు. ఈ అన్నాచెల్లెళ్ల పండుగను భయ్యా ధూజీ అనే పేరుతో ఉత్తరదేశంలో బాగా జరుపుకుంటారు. దక్షిణ భారతంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే జరుపుకుంటారు.   తమ సోదరి ఇంటికి వెళ్లి ఆమె చేతి భోజనాన్ని స్వయంగా తిని ఆమెను ఆశీర్వదిస్తారు.

భగినీ హస్త భోజనం పురాణ కథ

సూర్య భగవానికి యమధర్మరాజు , యమున.  కుమారుడు.. కుమార్తెలు .. యమునకు అన్నగారు అంటే విపరీతమైన అభిమానం. సమవర్తి యమధర్మరాజు సోదరి  యమున వివాహమై అత్తవారింటికి వెళ్లింది. అలా వెళ్లిన యమున తన సోదరుడు యమధర్మరాజుని తన ఇంటికి ఎన్నో సార్లు రమ్మని కోరింది. కాని ఆయనకు తీరిక ఉండేది కాదు. యమలోకంలో పాపులను శిక్షించే పనిలో రాత్రి వరకు తీరిక ఉండదు. పాపం చెల్లెలు కోరిక. తీర్చలేదని భాధపడేవాడు. కాలము గడచిపోతూ ఉంది. చివరికి వీలు చేసుకుని సోదరి ఇంటికి అనుకోకుండా ఒకనాడు ఆయనకు చెల్లెలు ఇంటికి వెళదామని అనకున్నాడు. ఆ రోజు కార్తీక శుద్ద విదియ.

ఇవి కూడా చదవండి

రాక రాక సోదరుడు వచ్చాడని యమున ఎంతో సంతోషపడింది. చెల్లెలు యమున సంతోషంగా అన్నయ్య. కు ఇష్టమైన  పదార్థాలు వండి దగ్గర కూర్చుని కొసరి కొసరి వడ్డించింది. ఎంతోకాలానికి కార్తీక శుద్ధ విదియనాడు కలవటంతో సోదరీ సోదరులు ఎంతో సంతోషించారు. ఆ సంతోషంతో యమధర్మరాజు సోదరిపై ప్రేమతో  నాకు ఇషమైన పదార్థములు తో భోజనము పెట్టావు. నీకు ఏదైనా వరం ఇస్తాను కోరుకో అని యమునకు చెప్పాడు. దీంతో యమనదేవి అన్నయ్యా లోకకల్యాణము కోసం నాకు ఒక వరము ఇవ్వు అని అడిగింది..

ఈ కార్తీక శుధ్ధ విదియనాడు లోకంలో ఎక్కడైనా సరే తన సోదరి ఇంటికి వెళ్లి అన్నా తమ్ముడు భోజనం చేస్తాడో నీవు ఎట్టి పరిస్థితి లో వారి జోలికి వెళ్ళవద్దని .. అటువంటి సోదరులకి ఆయురారోగ్యాలు ప్రసాదించమని ఇది నా కోరిక అని  యమధర్మరాజు ని యమున అడిగింది. . ఈ కోరికకి యమధర్మరాజు సంతోషించాడు. లోకకల్యాణం కోసం అడిగావు కనుక ” తధాస్తు” అని చెల్లెలు ను దీవించి వెళ్ళాడు.

దీంతో ఈరోజు అక్క , చెల్లెలు చేతివంట ఎవరైతే భోజనం చేస్తారో వారికి అపముృత్యు దోషం.. అంటే అకాల మరణం లేకుండా ఉంటుంది. సోదరుడికి భోజనం పెట్టిన ఆ సోదరి సౌభాగ్యవతిగా ఉంటుంది అని యముడు వరాలిచ్చాడట. అలా ఈ వరం సంప్రదాయంగా మారింది. కనుక ఈరోజు సోదరులు తమ సోదరి ఇంటికి వెళ్లి.. ఆమె చేతివంట తిని.. ఆప్యాయంగా బహుమతిని ఇచ్చి వస్తారు.

27 అక్టోబర్ 2022న శుభ సమయం

అభిజిత్ ముహూర్తం  11:42 నుండి 12:27 వరకు

12:11 నుండి 12:45 వరకు సర్వార్థ సిద్ధయోగం.

ఈరోజు సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వద్ద యమ దీపం పేరుతో నాలుగు ముఖాల దీపాన్ని కూడా ఉంచుతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..