- Telugu News Photo Gallery Spiritual photos Diwali 2022: Interesting facts about Nepal's Tihar worshipping animals
Diwali 2022: ఆ దేశంలో ఐదు రోజులు దీపావళి వేడుకలు.. కాకి, కుక్క, ఆవులను పూజించే వింత ఆచారం..
సమస్త ప్రాణికోటిలో దైవాన్ని చూడమని సనాతన హిందూ ధర్మం సిద్ధాంతం. పాములు, నెమళ్ళు, సింహం, పులి వంటి అనేక జీవులను దైవ స్వరూపంగా భావిస్తారు. పూజిస్తారు. అయితే నేపాల్ దేశంలో దీపావళి పర్వదినం రోజున కాకులు, కుక్కలు, ఆవులను పూజిస్తారు. తీహార్ గా ఐదు రోజుల పాటు జరుపుకునే దీపావళి పండగలో నాలుగు రోజులు పశుపక్ష్యాదులను ఫుజిస్తారు నేపాలీ హిందువులు.
Updated on: Oct 24, 2022 | 8:26 AM

నేపాల్‌లో, ఐదు రోజుల పాటు జరిగే దీపావళి పండుగను తీహార్ లేదా యమపంచక అని పిలుస్తారు. ఈ ఐదురోజుల్లో నాలుగు రోజులు పశు, పక్షులను పూజించడం ద్వారా జరుపుకుంటారు. ఐదో రోజు అన్నాచెల్లెళ్ల వేడుకను జరుపుకుంటారు. నేపాల్ లో జంతువులకు అంకితమైన దీపావళి పండుగ గురించి ఈరోజు తెలుసుకుందాం .

తీహార్ మొదటి రోజును 'కాగ్ తీహార్' (కాకుల పండుగ) అంటారు. కాకులకు ఆహారం ఇస్తారు. ధాన్యం,విత్తనాలు, తీపి పదార్ధాలను ఇంటి పైకప్పులపై లేదా వీధుల్లో ఉంచి పూజిస్తారు. కాకి యమధర్మ రాజుకి దూతగా భావిస్తారు. కాకి మృత్యు దూతని సూచిస్తుందని నమ్మకం. వీటిని పూజించడం ద్వారా అదృష్టాన్ని పొందవచ్చని నమ్ముతారు.

'కుకుర్ తీహార్' లేదా 'కుకుర్ పూజ' యమపంచకం యొక్క రెండవ రోజున వస్తుంది. కుకుర్ అంటే తెలుగులో కుక్క.. ఈ రోజున కుక్కలకు పూలమాలలు వేసి తిలకం పెట్టి పూజిస్తారు. ఉత్సవ పూజ తర్వాత.. కుక్కలకు ఇష్టమైన ఆహారాన్ని పెడతారు.

మూడవ రోజు కూడా తీహార్ పండుగలో అత్యంత ముఖ్యమైన రోజు. ఈరోజు 'గై పూజ' (ఆవు పండుగ) ఆచరిస్తారు. హిందూమతంలో ఆవు చాలా ముఖ్యమైన జంతువు. నేపాలీ హిందువులు ఈరోజు ఆవుకు విందు ఏర్పాటు చేస్తారు. కుంకుమ దిద్ది.. పూలమాల వేసి అలంకరిస్తారు. సాయంత్రం లక్ష్మీ దేవిని పూజిస్తారు

నాల్గవ రోజు, వేర్వేరు వ్యక్తులు వేర్వేరు జీవులను పూజిస్తారు. మరొకొందరు కొందరు పర్వతాలను లేదా తమను తామే పూజించుకుంటారు.
