- Telugu News Photo Gallery Spiritual photos PM Narendra Modi performs the Rajyabhishek of the symbolic Bhagwan Shree Ram in Ayodhya Uttar Pradesh
Ayodhya Deepotsav: అయోధ్య నగరంలో అంబరాన్నంటిన దీపోత్సవం.. రామ్‌లల్లాను దర్శించుకున్న ప్రధాని మోదీ..
దివ్వెల పండుగ దీపావళి సందర్భంగా అయోధ్య రాముడిని సందర్శించుకున్నారు ప్రధాని మోదీ. వేల కోట్లతో శ్రీరామ నగరాన్ని అభివృద్ది చేస్తున్నామని , జీవితంలో ఒక్కసారైనా అయోధ్యను దర్శించుకోవాలని పిలుపునిచ్చారు.
Updated on: Oct 23, 2022 | 8:35 PM

దివ్వెల పండుగ దీపావళి సందర్భంగా అయోధ్య రాముడిని సందర్శించుకున్నారు ప్రధాని మోదీ. వేల కోట్లతో శ్రీరామ నగరాన్ని అభివృద్ది చేస్తున్నామని , జీవితంలో ఒక్కసారైనా అయోధ్యను దర్శించుకోవాలని పిలుపునిచ్చారు.

పవిత్ర అయోధ్య నగరంలో దీపావళి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయోధ్యలో దీపోత్సవ్ కార్యక్రమానికి విచ్చేశారు మోదీ. శ్రీరామ పట్టాభిషేకాన్ని తన చేతుల మీదుగా నిర్వహిస్తున్నారు మోదీ.

శ్రీరాముడి ఆశీస్సులతో తాను అయోధ్యను దర్శించుకున్నట్టు తెలిపారు మోదీ. అయోధ్యలో ఎక్కడ చూసినా అణువణువు రాముడే కన్పిస్తాడని అన్నారు. 25 ఏళ్లలో భారత్‌ను అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు మోదీ.

శ్రీరామ్ లాలాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మోదీ. శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్ర నిర్మాణపు పనులను సమీక్షించారు మోదీ. దీపోత్సవ్ సందర్భంగా అయోధ్యలో 18 లక్షల దివ్వెలను వెలిగించారు. సరయూ నది తీరం దివ్వెలతో వెలిపోతోంది.

రామ్‌లీలా సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తున్నాయి. ప్రధాని మోదీ లేజర్‌షోను తిలకిస్తున్నారు. హారతి కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు.

రామ్‌లీలా కోసం శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు హెలికాప్టర్‌లో విచ్చేశారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ హారుతులిచ్చి వాళ్లకు స్వాగతం పలికారు.




