Andhra Pradesh: నేడు రుషికొండ అక్రమనిర్మాణాలపై టీడీపీ నిరసనకు పిలుపు.. ముందస్తుగా టీడీపీ నేతల హౌస్ అరెస్ట్
విశాఖ లో ప్రస్తుతం సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు లో ఉండడం తో ఎలాంటి ర్యాలీ లు, నిరసనలకు అనుమతి లేదని ఈ నేపధ్యంలో నే వాళ్ళ కు నోటీస్ లు ఇస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. అయితే పోలీసుల తీరు సరికాదని.. కనీసం ఏ కార్యక్రమానికి వెళ్ళకుండా అడ్డుకుంటున్నారని టీడీపీ ఆరోపిస్తోంది.
మరోసారి విశాఖ పట్నం వేదికగా అధికార, ప్రతిపక్ష నేతల మధ్య వార్ నెలకొంది. విశాఖలో ప్రభుత్వ వైఫల్యాలు, భూ వివాదాలపై టీడీపీ తన గళం విప్పనుంది. నేటి నుంచి పలు అంశాలపై నిరసనలకు సిద్దమైంది టీడీపీ. రోజుకో అంశం పై నిరసనకు షెడ్యూల్ ప్రకటించిన టీడీపీ.. ముందుగా రుషికొండ అక్రమ నిర్మాణాల పై ఈరోజు నిరసన కు పిలుపు నిచ్చింది. ఈ నిరసనలో టీడీపీ ఉత్తరాంధ్ర నేతలు అంతా పాల్గొనాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతల ను ముందస్తు గా ఇళ్ల కే పరిమితం చేసేలా పోలీస్ బలగాలను మోహరించారు. విశాఖ లో ప్రస్తుతం సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు లో ఉండడం తో ఎలాంటి ర్యాలీ లు, నిరసనలకు అనుమతి లేదని ఈ నేపధ్యంలో నే వాళ్ళ కు నోటీస్ లు ఇస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. అయితే పోలీసుల తీరు సరికాదని.. కనీసం ఏ కార్యక్రమానికి వెళ్ళకుండా అడ్డుకుంటున్నారని టీడీపీ ఆరోపిస్తోంది.
టీడీపీ ఉత్తరాంధ్ర ఇంచార్జ్ బుద్దా వెంకన్న ను విశాఖ కు రాకుండా ఇప్పటికే నిలువరించగా విశాఖ తూర్పు నియోజక వర్గ శాసన సభ్యుడు వెలగ పూడి రామకృష్ణబాబు ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. చావు పరామర్శకు వెళ్లినా పోలీసు బృందం వెంటాడుతూ ఉందని వెలగపూడి అవేదన వ్యక్తం చేశారు. అలాగే పల్లా శ్రీనివాస్, బండారు సత్యనారాయణ లతో పాటు టీడీపీ ముఖ్య నేతల కదలికలను అనుసరిస్తున్న పోలీసులు వారిని ఎక్కడికక్కడ నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నేతలు ఇప్పటికే టీడీపీ జిల్లా కార్యాలయానికి చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తున్నట్టు తెలపడం తో పోలీస్ బలగాలు కూడా టీడీపీ కార్యాలయాన్ని చుట్టుముట్టాయి. మరోవైపు వెలగపూడి, అయ్యన్న పాత్రుడు లాంటి నేతలు ఇప్పటికే ఇళ్ళ నుంచి బయల్దేరి బయటకు వెళ్లడం తో రాత్రి నుంచి వారికోసం పోలీసులు గాలిస్తున్నట్టు సమాచారం
Reporter: Eswar
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..