Health Tips: రోజూ నువ్వులు తింటే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. ఇంకా.. బోలెడంత ఎనర్జీ..!

తెల్లనువ్వులు, నల్ల నువ్వులు రెండు రకాల్లో దొరుకుతాయి. ఈ రెండింటిలోనూ పోషకాలు దాదాపు సమానంగా ఉంటాయి. నువ్వుల నూనెలో..

Health Tips: రోజూ నువ్వులు తింటే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. ఇంకా.. బోలెడంత ఎనర్జీ..!
Sesame Seeds
Follow us

|

Updated on: Oct 27, 2022 | 7:13 PM

మీ రోజువారీ ఆహారం సరిగ్గా ఉన్నప్పుడు, చికిత్స లేదా ఔషధం అవసరం ఉండదు.. కాబట్టి మన ఆహారపు అలవాట్లను సరిదిద్దుకోవడమే మనకు ముఖ్యమైన ఔషదం. మనకు అందుబాటులో ఉండే అనేక ఆహార పదార్థాలలో నువ్వులు కూడా ఒకటి..ఇవి మీ శరీరానికి అంతర్గతంగా, బాహ్యంగానూ ఎంతో ప్రయోజనకరంగా ఉండే అత్యంత ఉపయోగకరమైన ఆహార పదార్థాలలో ఒకటి. ఇది కాకుండా చాలా ఆయుర్వేద ఔషధాలలో నువ్వులకు ముఖ్యమైన స్థానం ఉంది. ఇందులో తెల్లనువ్వులు, నల్ల నువ్వులు రెండు రకాల్లో దొరుకుతాయి. ఈ రెండింటిలోనూ పోషకాలు దాదాపు సమానంగా ఉంటాయి. నువ్వుల నూనెలో ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన పిండిపదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా నల్ల నువ్వుల్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీహిస్టమైన్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే వీటిని ‘పవర్ హౌజ్’ అని పిలుస్తారు.

నువ్వుల్లో ఐరన్, జింక్, కాల్షియం, థయామిన్, ఇతర మినరల్స్‌తో పాటు విటమిన్ ‘ఇ’ కూడా సమృద్ధిగా ఉంటుంది. పిల్లలకు మసాజ్ చేయడానికి నువ్వుల నూనె చాలా అనుకూలంగా ఉంటుంది. ఇందులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలు, కండరాలు, కీళ్లను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. నువ్వులను రోజూ తీసుకోవడం వల్ల దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. దంతాలను బలంగా ఉంచడంలో సహాయపడుతుంది. మీ రోజువారీ ఆహారంలో నువ్వులను చేర్చుకోవడం వల్ల మీ జ్ఞాపకశక్తి పెరుగుతుంది. కాబట్టి మీ పిల్లలకు నువ్వులు తినడానికి ఇవ్వండి. ఇందులో విటమిన్ ఇ ఉంటుంది, ఇది మీ చర్మాన్ని తేమగా ఉంచుతుంది. నువ్వులల్లో ఉండే మూలాశక్తి వల్ల అల్ట్రావైలెట్ కిరణాలు చర్మంపై పడినప్పుడు ఏర్పడే నల్ల మచ్చలను తొలగిస్తుంది. అలాగే చర్మ సంబంధిత క్యాన్సర్‌ని నల్ల నువ్వులు తగ్గిస్తాయి.

నువ్వుల నుండి తీసిన నూనెలో శక్తి వంతమైన పదార్థాలు అధిక రక్తపీడనాన్ని తగ్గిస్తుంది. రక్తంలో యాంటీ ఆక్సిడెంట్ స్థాయిలను, మధుమేహ వ్యాధి గ్రస్తులలో ప్లాస్మాలోని గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది. ఎప్పుడు షాంపూలు వాడిన జుట్టు కొన్ని రోజుల తరవాత తేలిపోతుంది. నువ్వుల నూనె జుట్టుకు మంచిది. జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. నువ్వుల నూనెను జుట్టుకు పట్టిస్తే నువ్వులలోని పోషకాలు జుట్టుకు బలాన్ని ఇచ్చి మీ జుట్టును తిరిగి మాములుగా చేస్తుంది.

ఇవి కూడా చదవండి

నల్ల నువ్వుల్లో క్యాన్సర్‌ని నివారించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి బ్రెయిన్ లో ట్యూమర్ గ్రోత్ ను అడ్డుకుంటాయి. దాంతో బ్రెయిన్ క్యాన్సర్ సమస్య నుండి రక్షిస్తాయి. నల్లనువ్వుల నూనె వాడటం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలను తగ్గిస్తాయి. ఇందులోవుండే మినరల్స్ హృదయనాళాలను చురుకుగా పనిచేసేలా చేస్తోంది. దెబ్బలు తగిలినప్పుడు తొందరగా మానటంలో చాలా సహాయం చేస్తుంది. నల్ల నువ్వులు రోజు తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు పదార్థాలను బయటకు పంపుతుంది. శరీరానికి నూతన ఉత్తేజాన్నిస్తుంది. ఈ నువ్వుల్లో ఉండే పోషకాల వల్ల వయసు పెరిగిన అందం తగ్గకుండా కాపాడుతుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles