రూ. లక్షా 90వేలు పలికిన సల్మాన్‌, షారుఖ్‌.. కత్రినా ధర ఎంతో తెలుసా..? గాడిదల మార్కెట్‌లో కొనుగోలు చేసిన వ్యాపారి

ఈ జాతరలో సల్మాన్, షారుఖ్‌లను కూడా అమ్మకానికి పెడుతుంటారు ఇక్కడ నిర్వాహకులు.  చిత్రకూట్‌లోని ఈ గాడిద జాతరలో, వివిధ రాష్ట్రాల నుండి వ్యాపారులు గాడిదలను తీసుకువచ్చి వేలం ప్రక్రియను నిర్వహిస్తారు.

రూ. లక్షా 90వేలు పలికిన సల్మాన్‌, షారుఖ్‌.. కత్రినా ధర ఎంతో తెలుసా..? గాడిదల మార్కెట్‌లో కొనుగోలు చేసిన వ్యాపారి
Donkey Mela
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 27, 2022 | 4:48 PM

ఇదో విచిత్ర సంప్రదాయం. ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆచారం. ఆవులు,గేదెలు, ఎద్దులను అంగట్లో విక్రయించినట్టుగా ఇక్కడి ప్రజలు గాడిదలు, గుర్రాలను అమ్మకాలకు పెడుతుంటారు. ప్రతీయేటా దీపావళి అనంతరం ఇక్కడ ప్రత్యేకించి గాడిద మేళా నిర్వహిస్తారు. ఈ విచిత్ర జాతర జరిగేది మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో. మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలోని చిత్రకూట్‌లోని మందాకిని నది ఒడ్డున గాడిదల అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించిన ప్రత్యేకమైన జాతర జరుగుతుంది. ఈ జాతరలో సల్మాన్, షారుఖ్‌లను కూడా అమ్మకానికి పెడుతుంటారు ఇక్కడ నిర్వాహకులు.  చిత్రకూట్‌లోని ఈ గాడిద జాతరలో, వివిధ రాష్ట్రాల నుండి వ్యాపారులు గాడిదలను తీసుకువచ్చి వేలం ప్రక్రియను నిర్వహిస్తారు.

ఈ జాతర ప్రత్యేకత ఏమిటంటే.. కొనుగోలుదారులు, అమ్మకందారుల కంటే పర్యాటకులు ఇక్కడకు ఎక్కువగా వస్తారు. ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆచారం ప్రకారం దీపావళి మరుసటి రోజు నుంచి 3 రోజుల పాటు ఈ జాతర జరుగుతుంది. ఈసారి కూడా ఈ జాతర అట్టహాసంగా నిర్వహించారు. జాతర నిర్వహణ వెనుక ఓ పురాణ కథ ఉందంటున్నారు ఇక్కడి స్థానికులు. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం. .

ఔరంగజేబు కాలం నుండి ఈ జాతర నిరంతరం కొనసాగుతోంది. ఔరంగజేబు కాలంలో సైన్యానికి లాజిస్టిక్స్, ఇతర వస్తువుల కొరత ఉన్నప్పుడు, మొత్తం ప్రాంతంలోని గాడిదలను వాటి యజమానులు కొనడానికి,అమ్మడానికి ఇక్కడి పొల్లాల్లోకి వచ్చేవారు. ఈ జాతరలో వివిధ రకాలైన గాడిదలు ఉంటాయి. వీటిలో చాలా గాడిదలకు షారుఖ్, సల్మాన్, కత్రినాతో సహా పలువురు ప్రముఖ సినీ తారల పేర్లతో పిలిచుకుంటారు వాటి యజమానులు. ఈ గాడిద ఫెయిర్‌లో విక్రయించే అత్యంత ఖరీదైన గాడిదలకు సల్మాన్, షారుక్‌గా పేర్లు పెట్టారు వాటి యజమానులు.. వాటి పేర్ల మీదుగా వాటిని రూ.లక్ష 90 వేలకు ఖరారు చేయగా మిగిలిన గాడిదలను రూ.30 వేల నుంచి రూ.60 వేల వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా జాతర వ్యవస్థాపకుడు రమేష్ పాండే మాట్లాడుతూ.. ఔరంగజేబు కాలం నుంచి ఈ జాతర కొనసాగుతోందన్నారు. మొత్తం జాతరను ఎనిమిది రోజుల ముందుగానే నిర్వహిస్తారు. మార్కెట్‌లో గాడిదలు చాలా ఖరీదైనవి. దాదాపు 50 నుంచి 70 వేల రూపాయల వరకు విక్రయిస్తున్నారు. అందంగా కనిపించే సాధారణ గాడిదలు తక్కువ ధరకే ఉంటాయన్నారు. సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచే సినిమా నటీనటుల పేర్లను పెట్టారు. వాటి ధర కూడా ఎక్కువేనని అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!
హీరోయిన్‌కు బాధ.. ఫ్యాన్స్‌కు సంతోషం.! రష్మిక పోస్ట్‌కు మిక్స్‌డ్
హీరోయిన్‌కు బాధ.. ఫ్యాన్స్‌కు సంతోషం.! రష్మిక పోస్ట్‌కు మిక్స్‌డ్
రేసింగ్ కార్, లగ్జరీ విల్లా, కిలోల్లో బంగారం. నాగచైతన్యకు కానుకలు
రేసింగ్ కార్, లగ్జరీ విల్లా, కిలోల్లో బంగారం. నాగచైతన్యకు కానుకలు
ఏపీ మందుబాబులకు మరో గుడ్‌న్యూస్.. ఇది కదా కావాల్సింది
ఏపీ మందుబాబులకు మరో గుడ్‌న్యూస్.. ఇది కదా కావాల్సింది
గోవా వైన్ షాప్‌లో బన్నీ.! వీడియో చూపించి లాక్‌ చేసిన బాలయ్య..
గోవా వైన్ షాప్‌లో బన్నీ.! వీడియో చూపించి లాక్‌ చేసిన బాలయ్య..
ఆరెంజ్‌ జ్యూస్‌ తెచ్చిన అదృష్టం.. ఏకంగా రూ. 2.10 కోట్లు !!
ఆరెంజ్‌ జ్యూస్‌ తెచ్చిన అదృష్టం.. ఏకంగా రూ. 2.10 కోట్లు !!
జిల్‌ బైడెన్‌ టీ పార్టీకి పిలిచినా రానన్న ట్రంప్‌ సతీమణి..
జిల్‌ బైడెన్‌ టీ పార్టీకి పిలిచినా రానన్న ట్రంప్‌ సతీమణి..
దూకుడుగా క్రిప్టోకరెన్సీ.. బిట్‌కాయిన్‌ విలువ ఇన్ని లక్షలా ??
దూకుడుగా క్రిప్టోకరెన్సీ.. బిట్‌కాయిన్‌ విలువ ఇన్ని లక్షలా ??
కోల్‌కతా వైద్యురాలి కేసులో నిందితుడు. సంజయ్ రాయ్ సంచలన వ్యాఖ్యలు
కోల్‌కతా వైద్యురాలి కేసులో నిందితుడు. సంజయ్ రాయ్ సంచలన వ్యాఖ్యలు