AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK: త్వరలో గిల్గిట్‌-బాల్టిస్థాన్‌ను స్వాధీనం చేసుకుంటాం.. రాజ్‌నాథ్ సింగ్ సంచలన కామెంట్స్..

పాకిస్తాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. పాక్ ఆక్రమిత్ కశ్మీర్ ముమ్మాటికి భారత్‌దేనని అన్నారు. త్వరలోనే ఆక్రమిత కశ్మీర్‌ను స్వాధీనం చేసుకుంటామని..

IND vs PAK: త్వరలో గిల్గిట్‌-బాల్టిస్థాన్‌ను స్వాధీనం చేసుకుంటాం.. రాజ్‌నాథ్ సింగ్ సంచలన కామెంట్స్..
Defence Minister Rajnath Singh
Shiva Prajapati
|

Updated on: Oct 27, 2022 | 6:03 PM

Share

పాకిస్తాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. పాక్ ఆక్రమిత్ కశ్మీర్ ముమ్మాటికి భారత్‌దేనని అన్నారు. త్వరలోనే ఆక్రమిత కశ్మీర్‌ను స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. ఈ మేరకు పాకిస్తాన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారాయన. గిల్గిట్-బాల్టిస్థాన్‌ను చేర్చుకుంటేనే లద్దాఖ్‌, జమ్ముకశ్మీర్‌ కేంద్ర పాలిత ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధి లక్ష్యం పూర్తవుతుందని అన్నారు. గురువారం నాడు కేంద్ర రక్షణ శాఖ మంత్రి బుడ్గాంలో పర్యటించారు. ‘శౌర్య దినోత్సవ్’లో పాల్గొన్నారు. 1947 అక్టోబరు 27న భారత వాయు సేన శ్రీనగర్‌లో దిగి, పాకిస్థాన్ ముష్కరులతో పోరాడిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రసంగించిన రాజ్‌నాథ్ సింగ్.. దాయాది దేశం పాకిస్తాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

జమ్మూ-కశ్మీర్, లద్దాఖ్‌ లో అభివృద్ధి ప్రస్థానం ఇప్పుడే మొదలయ్యిందన్నారు రాజ్‌నాథ్‌. గిల్గిట్-బాల్టిస్థాన్‌ను చేరుకుంటే మన లక్ష్యం నెరవేరుతుందన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలపై పాకిస్థాన్ దురాగతాల గురించి ప్రస్తావిస్తూ, పొరుగు దేశం దాని పర్యవసానాలను అనుభవించవలసి వస్తుందన్నారు. ఉగ్రవాదానికి మతం లేదన్నారు. ఉగ్రవాదుల ఏకైక లక్ష్యం భారత దేశాన్ని టార్గెట్ చేయడమేనని చెప్పారు.

ఇవి కూడా చదవండి

జమ్మూ-కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్‌ 370ని 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దీనిని రద్దు చేయడం వల్ల జమ్మూ-కశ్మీర్ ప్రజలపై వివక్ష తొలగిపోయిందన్నారు రాజ్‌నాథ్‌ సింగ్.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..