AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Munugode by-election: కేల్ పాల్ కిర్రాక్ స్టెప్పులు.. మునుగోడు ప్రజలు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్

మునుగోడు ఉపఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీలో ఉన్న తన కామెడీ డైలాగులతో, పాటలు, స్టెప్పులతో జనాల్ని బాగా ఎంటర్‌టైన్ చేస్తున్నారు.

Munugode by-election: కేల్ పాల్ కిర్రాక్ స్టెప్పులు.. మునుగోడు ప్రజలు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్
Ka Paul
Ram Naramaneni
|

Updated on: Oct 25, 2022 | 9:49 PM

Share

సమయం లేదు మిత్రమా అంటున్నాయి పార్టీలు. పండుగ పూట ఖాళీ లేకుండా మునుగోడును చుట్టుముట్టేశాయి. జనం పండుగ సందడిలో ఉంటే నేతలు మాత్రం ఓట్ల వేటలో బిజీబిజీగా గడిపారు. ఇప్పటికే ప్రతి గ్రామంలో మకాం వేసిన నేతలంతా ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అడుగుతున్నారు. పండుగ పూట ప్రచారాన్ని మరింత ఉత్సాహంగా కొనసాగించారు నేతలు. అయితే మంగళవారం గ్రహణం సందర్భంగా సెంటిమెంట్ ఫాలో అయి నాయకులెవ్వరూ మునుగోడు నియోజకవర్గంలో కనిపించలేదు. కాగా ప్రజా శాంతి పార్టీ ప్రెసిడెంట్ కేఏ పాల్ మునుగోడు బరిలో ఉన్న విషయం విధితమే.  తన పార్టీ తరఫున వేసిన నామినేషన్ చెల్లదని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. దీంతో ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచిన  పాల్.. నియోజకవర్గంలో తన మార్క్ చూపిస్తున్నారు. ప్రచారం విషయంలో తాను మోనార్క్ అని తన యాక్షన్‌తో చూపిస్తున్నారు.

మునుగోడు ఓటర్లలో ఫుల్‌ జోష్‌ నింపుతున్నారు కేఏ పాల్‌. తన వెరైటీ ప్రచారంతో ఆకట్టుకుంటున్నారు. ఆయన ఎక్కడుంటే అక్కడ సందడే సందడి. తాజాగా నారాయణపూర్‌ మండలంలో స్టెప్పులు వేశారు. ఆయన డ్యాన్స్‌కు జనం ఈలలు, కేరింతలతో ఫుల్‌ సపోర్ట్‌ చేశారు. ఆయన మాంచి జోష్‌తో డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కేఏ పాలా మజాకా..? అని కామెంట్స్ పెడుతున్నారు ఆ వీడియో చూసిన నెటిజన్స్.

ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా గద్దర్  పోటీ చేస్తున్నట్లు తొలుత ప్రకటించారు కేఏ పాల్. కానీ ఆయన చివరి నిమిషంలో మనసు మార్చుకోవడంతో.. డైరెక్ట్‌ పాలే రంగంలోకి దిగారు. అప్పట్నుంచి అటు జనాలను ఎంటర్‌టైన్ చేయడంలోనూ, ఇటు మీడియా దృష్టి పడటంలోనూ స్పెషల్ కేర్ తీసకుంటున్నారు. మొన్నీమధ్య.. 6నెలల్లో మునుగోడును అమెరికాను చేస్తామన్నారు. ఆపై ఓ అధికారితో గొడవ పడి.. తెలంగాణ నెక్ట్స్ సీఎం తానే అని కలరింగ్ ఇచ్చారు. ఇలా పాల్ ఏం చేసినా నవ్వులే.. నవ్వులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!