Munugode Bypoll: మునుగోడు ప్రచారానికి సూర్యగ్రహణం ఎఫెక్ట్.. ప్రధాన నాయకులంతా గప్‌చుప్..
గ్రహణమా? ఎన్నికలప్రచారమా? అంటే... గ్రహణానికే ఓటేశారు నేతలు. అందుకే మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో.. ఇవాళ ప్రధాన పార్టీల అభ్యర్థులెవరూ బయట..
గ్రహణమా? ఎన్నికలప్రచారమా? అంటే… గ్రహణానికే ఓటేశారు నేతలు. అందుకే మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో.. ఇవాళ ప్రధాన పార్టీల అభ్యర్థులెవరూ బయట కనిపించలేదు. కాకపోతే, ఈ బైపోల్ కేంద్రంగా మాటల తూటాలు మాత్రం పేలాయి. అవును, సూర్య గ్రహణ ప్రభావం మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంపై పడింది. తెల్లారితే చాలు మైకేసుకుని రోడ్లమీదకు వచ్చేసే ప్రధాన పార్టీల అభ్యర్థులు.. గ్రహణం భయంతో క్యాంపెయిన్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అక్కడక్కడా ప్రచారరథాలు దర్శనమిచ్చినా.. అభ్యర్థులు, కీలక నేతలు మాత్రం అటువైపు రాలేదు.
అయితే, టీజేఎస్ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం.. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆఫీసు ముందు మౌనదీక్షకు దిగడం ఒక్కటే పొలిటికల్‌గా వేడి పుట్టించిన అంశం. మునుగోడు ఉప ఎన్నికల్లో మంత్రులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఈసీకి ఫిర్యాదు చేశారు కోదండరాం. అయితే, దీనికి స్ట్రాంగ్ కౌంటరే ఇచ్చారు ఎమ్మెల్యే బాల్క సుమన్. తాము టీఆర్‌ఎస్ కార్యకర్తల్లాగే ప్రచారం చేస్తున్నామని చెప్పారు. ఇక బీజేపీపై విమర్శలు గుప్పించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. బీజేపీకి ఓటమి భయం పట్టుకుందన్న మంత్రి.. దుబ్బాక, హుజురాబాద్ మాదిరే డ్రామాలతో గెలిచేందుకు కుట్ర మొదలు పెట్టిందని ఆరోపించారు.
ఇక మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో.. ఇతర పార్టీలన్నీ ఒకెత్తు, కేఏ పాల్ ఒకత్తు అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నం అలాంటిది మరి. తన డిఫరెంట్ యాక్టివిటీస్‌తో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నారు పాల్. మొత్తానికి గ్రహణం వేళ ప్రచారం అంతజోరుగా సాగకపోయినా.. పార్టీల మధ్య మాటల తూటాలు, పాల్‌సార్ డ్యాన్సులు బాగానే పేలాయన్నమాట.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..