Telangana: ఎంజీఎం ఆసుపత్రిలో పాముల సంచారంపై ఊహించని ట్విస్ట్.. ఆ వీడియోలు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు

ఎంజీఎంలో పాములు, ఎలుకల సంచరించడం కలకలంపై రేపింది. తాజాగా దీనిపై అధికార యంత్రాంగంలో కదిలిక వచ్చింది. ఆసుపత్రిలో ప్రక్షాళన ప్రారంభించారు.

Telangana: ఎంజీఎం ఆసుపత్రిలో పాముల సంచారంపై ఊహించని ట్విస్ట్.. ఆ వీడియోలు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు
Snake At MGM Hospital
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 25, 2022 | 7:08 PM

వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రిలో ఇటీవల విష పురుగుల సంచారం కలకలం రేపింది. పాములతో పాటు ఎలుకలు సంచరించడంతో రోగులు హడలిపోయారు. దీంతో ఎంజీఎం ఆసుపత్రిలో ప్రక్షాళన మొదలు పెట్టారు అధికారులు. ఎంజీఎం ఆస్పత్రి ప్రక్షాళనకు ముమ్మర చర్యలు చేపట్టారు సూపరింటెండెంట్ Dr చంద్రశేఖర్. ఇంజనీరింగ్ విభాగం, RMOలు, శానిటేషన్ సిబ్బందితో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. సిబ్బందిని వెంటబెట్టుకొని 39 బ్లాక్ లను పరిశీలించారు సూపరింటెండెంట్. ఆ తర్వాత ఆసుపత్రి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఎంజీఎంను అప్రతిష్టపాలు చేసేందుకు ఫేక్ వీడియోలు వైరల్ చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు సూపరింటెండెంట్. వైరల్ అవుతున్న వీడియోలు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి అసలు నిజాలు తేల్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

అంతకుముందు ఇదే నెలలో ఎంజీఎంలో రెండుసార్లు పాములు సంచరించడం కలకలం రేపింది. అక్టోబర్ 13న, అక్టోబర్‌ 23వ తేదీన రెండుసార్లు పాములు దర్శనమిచ్చాయి. దీంతో రోగులు, వారి బంధువులు హడలిపోయారు. 23వ తేదీన ఫీవర్ వార్డులోని టాయిలెట్స్ లో తాచు పాము ప్రత్యక్షమైంది. ఈ పామును చూసి హడలెత్తిపోయిన రోగులు, వారి బంధువులు పరుగులు తీశారు.. ఆస్పత్రి సిబ్బందికి సమాచారం ఇచ్చారు.. దీంతో వెంటనే స్పందించిన ఆస్పత్రి సిబ్బంది పాములు పట్టే వ్యక్తిని రంగంలోకి దింపి ఆ పామును ప్రాణాలతో పట్టుకున్నారు..

మొదటిసారి పాము కనిపించిన తర్వాత సీరియస్ గా స్పందించిన ఎంజీఎం సూపరింటెండెంట్ ఆస్పత్రి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు.. వైద్యులు, సిబ్బంది అంతా కలిసి ఎంజీఎం పరిసరాలను శుభ్రం చేశారు. ఎలుకలు, పాములకు పాములకు ఆవాసంగా ఉన్న పుట్టలు, వేస్టేజ్ తొలగించారు.. గతంలో ఎలుకలు కూడా హల్ చల్ చేశాయి.. దీంతో ఎలుకల నివారణకు ఎంజీఎం సూపరింటెండెంట్ శాశ్వత నివారణ చర్యలు చేపట్టారు.

రెండుసార్లు పాములు, ఒకసారి ఎలుకలు ఎంజీఎంలో కలకలం రేపడంతో తాజాగా ముమ్మర చర్యలు చేపట్టారు ఆసుపత్రి సూపరింటెండెంట్‌. మరోసారి విష పురుగులు ఈ ప్రాంతంలో సంచరించకుండా శాశ్వత చర్యలు తీసుకునేందుకు నడుం బిగించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..