RRR Movie: జపాన్‏లో ఆర్ఆర్ఆర్‏కు సెన్సెషనల్ రెస్పాన్స్.. ఏ ఇండియన్ సినిమాకు దక్కని రికార్డ్ ..

జపాన్ లో జక్కన్న సినిమాకు అత్యుత్తమ ఓపెనింగ్స్ వచ్చాయి. ఇప్పటివరకు జపాన్ లో విడుదలైన భారతీయ చిత్రాలన్నింటికంటే ఎక్కువ ఓపెనింగ్స్ నమోదు చేసుకుని రికార్డ్ సృష్టించింది.

RRR Movie: జపాన్‏లో ఆర్ఆర్ఆర్‏కు సెన్సెషనల్ రెస్పాన్స్.. ఏ ఇండియన్ సినిమాకు దక్కని రికార్డ్ ..
Rrr Movie
Follow us

|

Updated on: Oct 23, 2022 | 3:59 PM

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన ఆర్ఆర్ఆర్ చిత్రం అక్టోబర్ 21న జపాన్‏లో గ్రాండ్‏గా విడుదలైంది. డైరెక్టర్ రాజమౌళి.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముగ్గురు ట్రిబుల్ ఆర్ సినిమా ప్రమోషన్లలో చురుగ్గా పాల్గోన్నారు. వీరికి జపనీస్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. శుక్రవారం విడుదలైన ఈ మూవీకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. జపాన్ దేశంలో జక్కన్న సినిమాకు అత్యుత్తమ ఓపెనింగ్స్ వచ్చాయి. ఇప్పటివరకు జపాన్ లో విడుదలైన భారతీయ చిత్రాలన్నింటికంటే ఎక్కువ ఓపెనింగ్స్ నమోదు చేసుకుని రికార్డ్ సృష్టించింది. నివేదికల ప్రకారం ఈ సినిమా మొదటి రోజే దాదాపు రూ. 1.06 కోట్లు రాబట్టింది. గతంలో ప్రభాస్ నటించి సాహో చిత్రం ఒక్కరోజే రూ. 90 లక్షలతో రికార్డ్ సృష్టించిన.. ఆ రికార్డ్ బ్రేక్ చేసింది ట్రిబుల్ ఆర్. ఇక ఈ మూవీ వారాంతపు వసూళ్లు రూ. 3.5 కోట్లకు పైగా ఉండవచ్చని నివేదికలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం జక్కన్న అండ్ టీం జపాన్ లో సందడి చేస్తున్నారు.

జపనీస్ అభిమానులను తారక్, చరణ్‏ కలుసుకున్న ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. తమ అభిమాన హీరోలను చూడగానే జపాన్ ఫ్యాన్స్ కన్నీళ్లు పెట్టుకున్నారు. పలు రకాలుగా తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని దాదాపు రూ. 400 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ రావడమే కాకుండా అంతర్జాతీయంగా రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

ఇక జక్కన్న తదుపరి చిత్రం సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఉండనుంది. ఈ విషయాన్ని ఇప్పటికే రాజమౌళి పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చాడు. ఇప్పటివరకు తాను తెరకెక్కించిన సినిమాలన్నింటికి మించి మహేష్ తో చేయబోయే సినిమా ఉంటుందని స్వయంగా జక్కన్న చెప్పడంతో ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. వచ్చే ఏడాది వీరి కాంబోలో రాబోయే చిత్రం పట్టాలెక్కనుంది.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు