Prabhas Birthday: ‘ ప్రాజెక్ట్ కె’ సెట్‏లో ప్రభాస్ బర్త్ డే సెలబ్రెషన్స్.. వీడియో అదిరిపోయిందిగా..

అత్యంత ప్రతిష్టాత్మంకంగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న ప్రాజెక్ట్ కె షూటింగ్ సెట్‏లో ప్రభాస్ పుట్టిన రోజు వేడుకలు గ్రాండ్ గా నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి డార్లింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా.. తాజాగా శనివారం అర్థరాత్రి సెట్ లో జరిగిన బర్త్ డే సెలబ్రెషన్స్ వీడియోను షేర్ చేసింది చిత్రయూనిట్.

Prabhas Birthday: ' ప్రాజెక్ట్ కె' సెట్‏లో ప్రభాస్ బర్త్ డే సెలబ్రెషన్స్.. వీడియో అదిరిపోయిందిగా..
Prabaha 1
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 23, 2022 | 3:59 PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జక్కన్న తెరకెక్కించిన బాహుబలి మూవీతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న హీరో ప్రభాస్. అక్టోబర్ 23న డార్లింగ్ బర్త్ డే కావడంతో వారం ముందు నుంచి నెట్టింట ఫ్యాన్స్ సందడి షూరు చేశారు. ఇక ఈరోజు తమ అభిమాన హీరో పుట్టిన రోజు వేడుకలును తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. అటు డార్లింగ్ నటిస్తోన్న చిత్రాల నుంచి స్పెషల్ అప్డేట్స్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఇక అత్యంత ప్రతిష్టాత్మంకంగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న ప్రాజెక్ట్ కె షూటింగ్ సెట్‏లో ప్రభాస్ పుట్టిన రోజు వేడుకలు గ్రాండ్ గా నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి డార్లింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా.. తాజాగా శనివారం అర్థరాత్రి సెట్ లో జరిగిన బర్త్ డే సెలబ్రెషన్స్ వీడియోను షేర్ చేసింది చిత్రయూనిట్.

శనివారం అర్థరాత్రి సెట్ లో భారీగా టపాసులు కల్చారు చిత్రయూనిట్ సభ్యులు. తమ హీరోకు శుభాకాంక్షలు తెలుపుతూ అందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్ వేదికగా అభిమానులతో షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది. వైజయంతి మూవీస్ లాంటి ప్రఖ్యాత నిర్మాణ సంస్థలో దాదాపూ 500 కోట్ల బడ్జెట్ తో భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రంగా తెరకెక్కుతున్న ‘ప్రాజెక్ట్ కె’ పై విపరీతమైన అంచనాలున్నాయి. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్ లాంటి పాన్ ఇండియన్ నటులు ఇందులో నటిస్తున్నారు. మరోవైపు సెలబ్రెటీలు డార్లింగ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ది రెబల్ కింగ్.. డార్లింగ్ లకే డార్లింగ్ అయిన ప్రభాస్ కు హ్యాపీ బర్త్ డే. నీ సపోర్ట్, ప్రేమను ఎప్పటికీ మర్చిపోను. రానున్న రోజుల్లో నీకు అన్నింటా విజయమే చేకూరాలి అంటూ డైరెక్టర్ మారుతి విష్ చేశారు.

ప్రస్తుతం డార్లింగ్ చేతిలో ఉన్న చిత్రాలన్ని భారీ బడ్డెట్ పాన్ ఇండియా మూవీస్ కావడం విశేషం. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తుండగా.. త్వరలోనే డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. ఇవే కాకుండా ఆదిపురుష్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ చిత్రం చేయాల్సి ఉంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే